Private Bus Fire Accident: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH 65)పై పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్, సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల బస్సులో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగలిగారు.
ఘటన వివరాలు
ఈ ఘటన చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి కందుకూరుకు వెళ్తున్న ‘విహారీ ట్రావెల్స్’కు చెందిన ఈ బస్సులో సుమారు 29 నుంచి 40 మంది ప్రయాణికులు ఉన్నారు. పిట్టంపల్లి వద్దకు రాగానే బస్సులో నుంచి పొగలు దట్టంగా వ్యాపించాయి. పొగలు రావడాన్ని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై, బస్సును రోడ్డు పక్కన ఆపేశాడు. బస్సు సిబ్బంది ప్రయాణికులందరినీ తక్షణమే కిందికి దిగిపోవాలని హెచ్చరించారు. ప్రయాణికులందరూ కిందకు దిగిన కొద్దిసేపటికే మంటలు ఉగ్రరూపం దాల్చి బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. బస్సు పూర్తిగా కాలిపోయినప్పటికీ, ప్రయాణికులంతా క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: Horoscope Today: మీరు అనుకున్న పని పూర్తి అయ్యే రోజు.. వ్యాపారంపై ఎక్కువ శ్రద్ధ చూపడం మంచిది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తిని ప్రయాణికులు, స్థానికులు ప్రశంసించారు.

