Dude: ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ హిట్ చిత్రం ‘డ్యూడ్’ ఓటీటీలోకి రాబోతోంది. నవంబర్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. ఐదు భాషల్లో అందుబాటులోకి వస్తుంది.
ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా చిత్రం ‘డ్యూడ్’ దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలై అలరించింది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఓటీటీలోకి రావడానికి సిద్ధమైంది. నవంబర్ 14 నుంచి తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు. మమితా బైజు కథానాయికగా నటించిన ఈ చిత్రం రెండో వారంలోనే రూ.100 కోట్ల గ్రాస్ సాధించింది. సాయి అభ్యంకర్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. తమిళ సీనియర్ నటుడు ఆర్. శరత్‌కుమార్ ముఖ్య పాత్రలో నటించారు. నేహా శెట్టి అతిథి పాత్రలో కనిపించారు. కోలీవుడ్‌లో మైత్రి మూవీ మేకర్స్‌కు మరో హిట్‌ను అందించిన ఈ చిత్రం ఓటీటీలో కూడా అదే స్థాయి ఆదరణ పొందే అవకాశం ఉంది.
