AP Cabinet Key Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు 65కు పైగా అంశాల ఎజెండాతో సాగిన ఈ సమావేశంలో దాదాపు అన్ని అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా, త్వరలో వైజాగ్‌లో జరగబోయే సీఐఐ సమ్మిట్‌కు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. అలాగే, రాష్ట్రంలో క్వాంటమ్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
‘మొంథా’ తుఫాను సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు మంత్రులు తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. మరో ముఖ్యమైన నిర్ణయంగా, పార్టీ కార్యాలయాల లీజ్‌కు సంబంధించిన చట్ట సవరణకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ఈ విధంగా అనేక ముఖ్యమైన విధానపరమైన నిర్ణయాలకు ఆమోదం తెలుపుతూ కేబినెట్ సమావేశం విజయవంతంగా ముగిసింది.

