Gold Price Today: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక ముఖ్యమైన అప్‌డేట్. ఇటీవల కాలంలో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. లక్షా 30 వేల మార్కును దాటిన ధరలు దాదాపు రూ.10,000 వరకు తగ్గడంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, కొద్ది రోజుల పాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరగడం మొదలుపెట్టాయి. ఈ సోమవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి.
భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు
నిన్నటితో పోలిస్తే, ఈ రోజు పది గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,200 మేర పెరిగింది. ఈ పెరుగుదలతో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర రూ.1,23,220కి చేరింది. అలాగే, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర కూడా రూ.1,100 పెరిగి రూ.1,12,950గా నమోదైంది. బంగారం ధరతో పాటు వెండి ధర కూడా కిలోకు ఏకంగా రూ.2,500 మేర పెరిగి, దేశీయంగా రూ.1,55,000 దగ్గర ఉంది.
హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,23,220
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,12,950
కిలో వెండి ధర: రూ.1,67,000
అయితే, ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, దేశంలోని అన్ని నగరాల్లో బంగారం, వెండి ధరలు ఒకేలా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, రాష్ట్ర పన్నులు వంటి కొన్ని అంశాల కారణంగా ధరల్లో తేడాలు ఉంటాయి. ఉదాహరణకు, చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,480 కాగా, ఢిల్లీలో రూ.1,23,370గా ఉంది.

