Terriost

Terriost: మెడికల్ కాలేజీ లో టెర్రరిస్టులు.. RDX , AK-47 రైఫిల్ స్వాధీనం

Terriost: జమ్మూ కాశ్మీర్ భద్రతా దళాలు – హర్యానా పోలీసులు కలిసి జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో దేశంలోనే అతిపెద్ద పేలుడు పదార్థాల స్వాధీనం కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్టయిన కాశ్మీరీ వైద్యుడిచ్చిన సమాచారం మేరకు, హర్యానాలోని ఫరీదాబాద్‌లోని ఒక వైద్య కళాశాల నుంచి భారీ మొత్తంలో అనుమానిత రసాయనాలు – ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

వైద్యుడి సమాచారంతో దాడులు

జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆయుధాల కేసులో డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్‌ను అరెస్టు చేయగా, అతనిచ్చిన వివరాల ఆధారంగా ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ ఆసుపత్రిపై దాడులు చేశారు. అధికారులు ఫరీదాబాద్‌లోని వైద్య కళాశాల ప్రాంగణం నుంచి సుమారు 360 కిలోగ్రాముల అనుమానిత అమ్మోనియం నైట్రేట్‌ను (పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించే రసాయనం) స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఒక అస్సాల్ట్ రైఫిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

డాక్టర్ రాథర్ ఇచ్చిన సమాచారం మేరకు, అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న మరో వైద్యుడు, పుల్వామా జిల్లాలోని కోయిల్ నివాసి అయిన ముజామిల్ షకీల్‌ను కూడా అరెస్టు చేశారు. తొలుత(ముందుగా) ఇది RDX – AK-47 రైఫిల్ అని నివేదికలు వచ్చినా, ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ సతేందర్ కుమార్, “స్వాధీనం చేసుకున్నది RDX కాదు, బహుశా అమ్మోనియం నైట్రేట్ కావచ్చు. ఆ రైఫిల్ AK-47 కాదు” అని స్పష్టం చేశారు.

తీవ్రవాద సంస్థల నెట్‌వర్క్‌పై అనుమానం

ఈ ఇద్దరు వైద్యులు ఆయుధాలు – పేలుడు పదార్థాలను నిల్వ చేయడంలో, అక్రమంగా రవాణా చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది. వీరిని ఇప్పటికే జమ్మూ కాశ్మీర్‌కు తరలించి పోలీసు కస్టడీలో ఉంచారు.

ఇది కూడా చదవండి: Digital Gold: సెబీ వార్నింగ్.. మీరు డిజిటల్ గోల్డ్ కొంటున్నారా.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి

నిషేధిత ఉగ్రవాద సంస్థలైన జైష్-ఎ-మొహమ్మద్ (JeM) – ఘజ్వత్-ఉల్-హింద్ లతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న జమ్మూ – కాశ్మీర్ వైద్యుల నెట్‌వర్క్‌పై భద్రతా సంస్థలు ఇప్పుడు విస్తృత దర్యాప్తును ప్రారంభించాయి. కేంద్రపాలిత ప్రాంతం వెలుపల ఆయుధాల అక్రమ రవాణాకు ఈ నెట్‌వర్క్ సహకరిస్తున్నట్లు గుర్తించారు. నిందితులపై ఆయుధ చట్టంలోని సెక్షన్లు – చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద కేసులు నమోదు చేశారు.

లోయ అంతటా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్

ఈ అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో, జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతా బలగాలు భారీ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. ఆదివారం నుంచి లోయ అంతటా నిర్వహించిన దాడుల్లో ఒక మహిళతో సహా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.శీతాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో, ఎగువ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు ఉగ్రవాదులు ఆశ్రయం కోసం వస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో రాంబన్, కిష్త్వార్, దోడా, కథువా, రియాసి, పూంచ్ – రాజౌరి జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో సోదాలు – కార్డన్ డ్రైవ్‌లు కొనసాగుతున్నాయి.ఈ అరెస్టుల ద్వారా, ఉగ్రవాద సంస్థలకు కీలకమైన లాజిస్టిక్స్ – మద్దతును అందించే నెట్‌వర్క్‌పై భద్రతా సంస్థలు దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *