Ande Sri

Ande Sri: ప్రముఖ రచయిత అందెశ్రీ (64) కన్నుమూత

Ande Sri: తెలంగాణ ఉద్యమ గీతం ‘జయ జయహే తెలంగాణ’ రచయిత, ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) (64) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం (నవంబర్ 10, 2025) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇంట్లో కుప్పకూలి పడిపోయిన ఆయన్ను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.

అందెశ్రీ: జీవితం – సాహితీ సేవ

అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. పల్లె ప్రజల జీవితాలు, వారి కష్టాలు, ఆకాంక్షలను తన కవిత్వంలో నిత్యం ప్రస్తావించిన ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.

జై జైహే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఈ గీతం ఊపిరిగా నిలిచింది. 2006లో వచ్చిన ‘గంగ’ సినిమాకు ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారం అందుకున్నారు. అప్పటికప్పుడే కవిత్వం చెప్పడంలో (అశువు కవిత్వం) అందెశ్రీ దిట్ట. తనదైన ప్రత్యేక శైలిలో తెలుగు సాహిత్యానికి కొత్త అందాలు తీసుకొచ్చారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నారు.

ఇది కూడా చదవండి: Lesbian: లెస్బియన్ రిలేషన్.. ఐదు నెలల కొడుకును చంపిన తల్లి!

పురస్కారాలు – గౌరవాలు

అందెశ్రీ చేసిన సాహితీ సేవలకు గుర్తింపుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక గౌరవాలు, పురస్కారాలు దక్కాయి:

కాకతీయ యూనివర్సిటీ నుంచి మరియు 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 2015లో ప్రతిష్ఠాత్మక దాశరథి సాహితీ పురస్కారం పొందారు. 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయనకు కోటి రూపాయల పురస్కారాన్ని అందించింది.

అందెశ్రీ మరణం పట్ల ముఖ్యమంత్రి సహా, సాహితీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలంగాణ భాష, సంస్కృతికి తీరని లోటు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *