JanaSena Account Hacked

JanaSena Account Hacked: జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

JanaSena Account Hacked: జనసేన పార్టీకి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (గతంలో ట్విట్టర్) ఖాతా హ్యాకింగ్‌కు గురవడం తీవ్ర కలకలం రేపింది. ఈ హ్యాకింగ్ వెనుక బిట్‌కాయిన్ స్కామ్ కుట్ర ఉన్నట్లు పార్టీ ఐటీ విభాగం గుర్తించింది.

హ్యాకింగ్ వివరాలు, యూకే లింక్

జనసేన పార్టీ ఐటీ విభాగం విడుదల చేసిన వివరాల ప్రకారం.. నవంబర్ 8 సాయంత్రం 6 గంటల తర్వాత ఈ అకౌంట్‌లో అనుమానాస్పద కార్యకలాపాలు చోటుచేసుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన పార్టీ ఐటీ విభాగం సైబర్ టీమ్‌తో విశ్లేషణ చేయగా, ఈ హ్యాకింగ్ వెనుక యునైటెడ్ కింగ్‌డమ్ (UK) నుంచి లాగిన్ అయినట్లు ఆధారాలు గుర్తించారు. హ్యాకర్లు ఈ అకౌంట్‌ను ఉపయోగించి క్రిప్టో ట్రేడింగ్ మరియు బిట్‌కాయిన్ లింక్‌లను షేర్ చేసి, ఫాలోవర్లను మోసం చేసే ప్రయత్నం చేసినట్లు అనుమానిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Anupama: అనుపమకు ఆన్‌లైన్ వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు

పార్టీ కార్యకర్తలకు సూచన

హ్యాకింగ్‌ను గుర్తించిన వెంటనే జనసేన పార్టీ అప్రమత్తమైంది. ప్రస్తుతం పార్టీ ఐటీ విభాగం ఈ హ్యాక్ అయిన అకౌంట్‌ను తిరిగి రికవరీ చేసే ప్రయత్నాలలో నిమగ్నమై ఉంది.ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు ప్రజలకు జనసేన ముఖ్య సూచనలు జారీ చేసింది: తమ అకౌంట్ ద్వారా షేర్ అవుతున్న ట్రేడింగ్ లేదా బిట్‌కాయిన్ లింక్‌లపై ఎవరూ క్లిక్ చేయవద్దు. ఈ విధమైన లింక్స్‌ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పార్టీ హెచ్చరికలు జారీ చేసింది.

ప్రభుత్వ మరియు రాజకీయ పార్టీల అధికారిక ఖాతాలపై సైబర్ దాడులు పెరుగుతున్న తరుణంలో, జనసేన అకౌంట్ హ్యాకింగ్ ఘటన సంచలనంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *