CM Chandrababu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే రోల్ మోడల్: ‘సంజీవని ప్రాజెక్టు’ ప్రారంభించిన సీఎం

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా పెదకాకానిలో కీలక ప్రకటన చేశారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి ఆధ్వర్యంలో నడుస్తున్న శంకర కంటి ఆసుపత్రి నూతన భవనం, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని ఆదివారం లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ‘సంజీవని ప్రాజెక్టు’ గురించి వివరిస్తూ, ప్రపంచంలో ఎక్కడ ఉన్న ఆరోగ్య పరిజ్ఞానాన్ని అయినా రోగి ఇంటి వద్దకే వైద్యం అందించేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్యానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్య రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేసి, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆరోగ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఎంత ఆస్తిపాస్తులు, పెద్ద ఇళ్ళు, ఖరీదైన కార్లు, ఉన్నత స్థానం ఉన్నా… ఆరోగ్యంగా లేకపోతే అదంతా వ్యర్థమే. అనారోగ్యమే నిజమైన పేదరికం” అని ఆయన అభివర్ణించారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్న శంకర ఆసుపత్రికి అన్ని విధాలా సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

Also Read: AP Cabinet Meeting: రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి భేటీ

సంజీవని పథకం ద్వారా ఇంటి వద్దకే వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నామని ప్రకటించిన సీఎం, రాష్ట్రంలో చిన్న పెద్దా తేడా లేకుండా అందరికీ వర్తించేలా 2,50,000 మందికి హెల్త్ ఇన్సూరెన్స్‌ను తీసుకురానున్నట్లు వివరించారు. శంకర కంటి ఆసుపత్రి అందిస్తున్న సేవలను ముఖ్యమంత్రి ప్రశంసించారు. కేవలం భారతదేశంలోనే కాక, నేపాల్, కాంబోడియా, నైజీరియా వంటి విదేశాలలో కూడా శంకర ఐ ఆసుపత్రులు సేవలందిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ ఆసుపత్రి రోజుకు 750 మందికి కంటి శస్త్ర చికిత్సలు ఉచితంగా చేస్తోందని, ఇది అరుదైన విషయమని పేర్కొన్నారు.

ముఖ్యంగా, ‘రెయిన్‌బో కార్యక్రమం’ ద్వారా పిల్లల కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, ఇప్పటి వరకు 32 వేల వైద్య శిబిరాలు నిర్వహించి దాదాపు 30 లక్షల మందికి కంటి శస్త్రచికిత్సలు చేయడం వంటి ఫౌండేషన్ సేవలను ఆయన అభినందించారు. కంచి పీఠం పిలుపునిస్తే అనేకమంది దాతలు స్పందిస్తారని, కంచి పీఠం లాంటి ఆధ్యాత్మిక సంస్థలే మన దేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండటానికి కారణమని ఆయన తెలిపారు. ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రాంగణాన్ని పూర్తిగా సందర్శించి, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రంలోని అత్యాధునిక వైద్య పరికరాలు, ఐ బ్యాంక్ సేవలతో పాటు, పేదలకు ఉచితంగా అందుతున్న వైద్య సహాయం గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *