Revanth Reddy

Revanth Reddy: కేటీఆర్‌ భాష ఒక్కటే కాదు.. అలవాట్లను కూడా మార్చుకోవాలి

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ప్రతిపక్ష నేతలపై, ముఖ్యంగా బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ భాష, అలవాట్లను మార్చుకోవాలని హితవు పలికిన రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల మాత్రం సానుకూల వైఖరిని ప్రదర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం లో భాగంలో తాజ్ కృష్ణ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌పై సానుభూతి..కేటీఆర్‌పై విమర్శ

రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించడానికి బదులు, ఆయన ఆవేదనలో ఉన్నారని వ్యాఖ్యానించడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించింది. కేసీఆర్ ఆవేదనలో ఉన్నారు, ఆయన్ని ప్రత్యర్థిగా చూడటం లేదు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కేటీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, కేటీఆర్ భాష ఒక్కటే కాదు, అలవాట్లను కూడా మార్చుకోవాలి అని పరోక్షంగా విమర్శించారు.

ఇది కూడా చదవండి: Lesbian: లెస్బియన్ రిలేషన్.. ఐదు నెలల కొడుకును చంపిన తల్లి!

బీఆర్‌ఎస్ అభ్యర్థి జూబ్లీహిల్స్ సునీతను గెలిపించాలని కేసీఆర్ ఇప్పటి వరకు అడిగారా అని రేవంత్ ప్రశ్నించారు. మాగంటి గోపీనాథ్ మరణం చుట్టూ ఉన్న వివాదం మరియు సునీత అభ్యర్థిత్వంపై కేసీఆర్ వైఖరిని రేవంత్ రెడ్డి పరోక్షంగా ప్రశ్నించారు.

నాది ‘కేడర్ మైండ్‌సెట్’

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంపై రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. తాను ఎన్నికల ప్రచారానికి ఎందుకు వెళ్తున్నారో వివరించారు.  నాది లీడర్ మైండ్‌సెట్ కాదు, కేడర్ మైండ్‌సెట్  అని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికలు జరుగుతుంటే నేను ఇంట్లో కూర్చోలేను. అందుకే జూబ్లీహిల్స్ ప్రచారానికి వెళ్తున్నా అని ఆయన తెలిపారు. కేడర్‌ను ముందుకు నడిపించాలనే ఉద్దేశంతోనే ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం

బీజేపీ భవిష్యత్తుపై రేవంత్ రెడ్డి చేసిన పాత వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ, తన అంచనా నిజమైందని పేర్కొన్నారు.

“బీజేపీ సింగిల్ డిజిట్‌కు పరిమితం అవుతుందని చెప్పలేదా?” అని ప్రశ్నించారు. ఇది రాష్ట్రంలో బీజేపీ పనితీరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యగా భావించవచ్చు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *