Bandi Sanjay

Bandi Sanjay: రాష్ట్రంలో RK బ్రదర్స్‌ పాలన జరుగుతుంది

Bandi Sanjay: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ తెలంగాణ రాజకీయాలపై మరియు క్రీడా సంస్థల్లోని అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ‘ఆర్కే బ్రదర్స్’ పాలన జరుగుతోందని ఆరోపించిన ఆయన, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో జరుగుతున్న అవినీతిపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో కొత్త ‘బ్రదర్స్‌’ పాలన

రాష్ట్రంలో పాత ట్యాక్స్ వ్యవస్థ పోయి, కొత్త ‘ఆర్కే’ పాలన మొదలైందని బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు.  తెలంగాణలో ప్రస్తుతం ఆర్కే (RK) బ్రదర్స్ పాలన నడుస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. R అంటే రేవంత్ రెడ్డి, K అంటే కేటీఆర్ మొన్నటి వరకు రాష్ట్రంలో ఓకే (OK) ట్యాక్స్‌ నడిచిందని (ఓ అంటే ఓవైసీ, కే అంటే కేటీఆర్ ట్యాక్స్) ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఓకే ట్యాక్స్ పోయి, ఓఆర్‌ (OR) ట్యాక్స్‌ నడుస్తుందని విమర్శించారు. O అంటే ఓవైసీ, R అంటే రేవంత్ రెడ్డి,

ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణ మంత్రిమండ‌లిలో మార్పులు త‌థ్యం! జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల త‌రువాయి త‌ప్ప‌దా?

ఎంఐఎం, చైన్ స్నాచర్ల రాజ్యంపై ఆరోపణలు

ఎంఐఎం పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన బండి సంజయ్, రాష్ట్రంలో చైన్ స్నాచింగ్ ఘటనల పెరుగుదలను రాజకీయం చేశారు.ఎంఐఎం (MIM) వాళ్లే చైన్ స్నాచర్లుగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో చైన్ స్నాచర్ల రాజ్యం వచ్చిందని, రేపు జూబ్లీహిల్స్‌లో కూడా ఇదే రాబోతుందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.

హెచ్‌సీఏపై బండి సంజయ్ ఆగ్రహం

రాష్ట్ర రాజకీయాలపై విమర్శలు గుప్పించిన అనంతరం, బండి సంజయ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో జరుగుతున్న అవినీతిపై మండిపడ్డారు.హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీ లక్షల రూపాయలు వసూలు చేస్తూ, నైపుణ్యం లేని క్రికెటర్లను ఎంపిక చేస్తోందని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అంశంపై ఇప్పటికే రాచకొండ కమిషనర్‌కు సమాచారం ఇచ్చామని, త్వరలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కూడా అధికారికంగా ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ తెలిపారు. హెచ్‌సీఏలోని అవినీతికి సంబంధించిన వాస్తవాలు త్వరలోనే బయటకొస్తాయని ఆయన స్పష్టం చేశారు.బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయంగా, అలాగే క్రీడా వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *