Khammam: అదృష్టం ఒకే ఒక్క లాటరీ టికెట్ రూపంలో తలుపు తట్టింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాత్రికి రాత్రే రూ. 240 కోట్ల (UAE $100 మిలియన్లు) భారీ మొత్తంతో కోటీశ్వరుడిగా మారాడు. తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, వేంసూరు మండలం, భీమవరం గ్రామానికి చెందిన యువకుడు బోల్లా అనిల్ కుమార్ ఈ అపూర్వ అదృష్టాన్ని సొంతం చేసుకున్నాడు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న అనిల్ కుమార్, తన తల్లి పుట్టిన తేదీని లక్కీ నంబర్‌గా ఎంచుకొని కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు బంపర్ ప్రైజ్ తగిలింది. సాధారణ రైతు కుటుంబానికి చెందిన అనిల్ జీవితం ఈ అద్భుత విజయంతో ఒక్కసారిగా మారిపోయింది. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్దఎత్తున వైరల్‌గా మారి సెలబ్రిటీ స్థానంలో ఆయన నిలిచిపోయారు. అదృష్టమంటే ఇలా ఉండాలి అని పలువురు చర్చించుకుంటున్నారు. పేదరికంలో ఉన్న ఆ కుటుంబాన్ని లాటరీ ఒక్కసారిగా ధనికులను చేసింది.

