Nalgonda: నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులను సెకండ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్లు సమాచారం.
వివరాల ప్రకారం, గత నెల అక్టోబర్ 31న హాస్టల్‌లో ర్యాగింగ్ జరిగింది. బాధిత విద్యార్థులు ఈ విషయం గురించి హాస్టల్ వార్డెన్ మరియు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు.తమపై ఫిర్యాదు చేసినందుకు ఆగ్రహించిన సీనియర్లు ఈ నెల 4న మరోసారి ర్యాగింగ్‌కు పాల్పడ్డారని తెలిసింది.
ఈ ఘటనపై స్పందించిన ప్రిన్సిపల్ సత్యనారాయణ, “ర్యాగింగ్ వ్యవహారం మా దృష్టికి రాలేదు” అని పేర్కొన్నారు.ఘటనపై కాలేజీ యాజమాన్యం, పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.

