IT Serve Synergy: అమెరికాలోని ఐటీ సేవల రంగానికి ప్రతిష్టాత్మక వేదికగా నిలిచిన ITServe Synergy ఈవెంట్, ఈసారి కొత్త చరిత్ర సృష్టించబోతోంది. ఎన్నో సంవత్సరాలుగా అమెరికాలో జరుగుతూ వచ్చిన ఈ మహా సదస్సు, ఈసారి మొదటిసారిగా అమెరికా వెలుపల పోటోరికో ఐల్యాండ్‌లో జరగబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్, స్టార్టప్ లీడర్స్, బిజినెస్ ఎంట్రప్రెన్యూర్స్ కోసం ఇది ఒక అత్యంత ప్రాముఖ్యమైన గ్లోబల్ సమ్మిట్‌గా మారింది.
టెక్నాలజీ, బిజినెస్ మరియు లీడర్‌షిప్ మేళవింపు
ITServe Synergy అనేది కేవలం ఒక కాన్ఫరెన్స్ మాత్రమే కాదు; ఇది IT సర్వీస్ మరియు కన్సల్టింగ్ రంగంలో నిమగ్నమైన 3,000+ వ్యవస్థాపకులు, CXO లు, మరియు విధాన నిర్ణేతలకు ఒక శక్తివంతమైన కేంద్రం.
ముఖ్యాంశాలు: ఇమ్మిగ్రేషన్ విధానాలు, టెక్నాలజీ ట్రెండ్స్ (AI & ML), మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ (M&A), ఫైనాన్స్, ప్రభుత్వ పాలసీలపై లోతైన చర్చలు మరియు ప్యానెల్ డిస్కషన్స్ ఇక్కడ జరుగుతాయి.
గత సంవత్సరం 2024లో లాస్ వెగాస్‌లో జరిగిన ITServe Synergy 2024 ఈవెంట్ అద్భుతంగా సాగింది. ఆ ఈవెంట్‌కి నారా లోకేష్ గారు, ఇతర ప్రముఖులు హాజరై, ఇండియన్ ఐటీ ఎంట్రప్రెన్యూర్స్ విజయాలను ప్రశంసించారు. వేలాది మంది టెక్ లీడర్స్, బిజినెస్ ఓనర్స్ పాల్గొనడంతో, ఆ ఈవెంట్ ఒక గ్రాండ్ సక్సెస్ గా నిలిచింది.
2025లో కొత్త గమ్యం పోటోరికో ఐల్యాండ్
Synergy 2025 ఈవెంట్ ఈసారి డిసెంబర్ 4 మరియు 5 తేదీల్లో, అద్భుతమైన సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన Puerto Rico Convention Center, San Juan లో జరగనుంది. ఇది ITServe Alliance చరిత్రలో ప్రత్యేక ఘట్టం ఎందుకంటే ఈవెంట్ అమెరికా మెయిన్‌ల్యాండ్ బయట జరగడం ఇదే మొదటిసారి.
ముఖ్య అతిథులు & ప్రత్యేక ఆకర్షణలు
ఈ సారి Synergy 2025 ఈవెంట్‌కి హాజరయ్యే ప్రముఖులు వీరే
వివేక్ రామస్వామి (U.S. Entrepreneur & Politician)
డానియెల్ ఇవెస్ (టెక్ మార్కెట్ అనలిస్ట్, Wedbush Securities)
సందీప్ కాల్రా (Persistent Systems CEO)
లియాండర్ పేస్ (భారత టెన్నిస్ లెజెండ్)
సానియా మీర్జా (భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్)
డయానా హెడెన్ (మిస్ వరల్డ్ 1997)
ఇంకా అనేక టాప్ సెలబ్రిటీలు, ఐటీ లీడర్లు, ఇన్నోవేటర్స్, మరియు ఇన్వెస్టర్లు ఈ వేదికపై తమ అనుభవాలను పంచుకోనున్నారు.
ITServe Synergy అంటే ఏమిటి?
ITServe Alliance అనేది అమెరికాలోని ఐటీ సేవల, స్టాఫింగ్ మరియు కన్సల్టింగ్ కంపెనీలతో కూడిన పెద్ద సంఘం. ప్రతి సంవత్సరం “Synergy” పేరుతో వారు ఈ మెగా ఈవెంట్ నిర్వహిస్తారు. దీని ముఖ్య ఉద్దేశ్యం టెక్ రంగంలో నెట్‌వర్కింగ్,ఇన్నోవేషన్ & బిజినెస్ గ్రోత్ పై చర్చలు జరపడం, స్టార్టప్‌లకు మార్గదర్శకం, ఇమిగ్రేషన్, కాంట్రాక్టింగ్, టెక్ ట్రెండ్స్ వంటి కీలక అంశాలపై సెషన్లు నిర్వహిస్తారు.
ఈవెంట్‌లో ఉండే ముఖ్య కార్యక్రమాలు
కీ నోట్ స్పీకర్స్ సెషన్స్, స్టార్టప్ & టెక్ ఎగ్జిబిషన్స్, బిజినెస్ నెట్‌వర్కింగ్ ఈవెంట్స్, ఇన్నోవేషన్ & ఇన్వెస్టర్ మీట్స్
గ్లామర్ ఫెస్టివిటీస్ & ఎంటర్టైన్‌మెంట్ షోలు
ఎందుకు పాల్గొనాలి?
మీరు ఒక ఐటీ సేవల కంపెనీ, స్టార్టప్ ఫౌండర్, లేదా టెక్ ఎంట్రప్రెన్యూర్ అయినా Synergy 2025 ఒక అవకాశాల వేదిక. అమెరికా మరియు గ్లోబల్ ఐటీ మార్కెట్‌లో ట్రెండ్స్ తెలుసుకోవచ్చు. కొత్త భాగస్వామ్యాలు ఏర్పరచుకోవచ్చు. బ్రాండ్ విజిబిలిటీ & గ్లోబల్ ఎక్స్పోజర్ పొందవచ్చు.

