Vishnu Priya: బిగ్ బాస్ కి వెళ్లడం ఓ చెత్త నిర్ణయం..

Vishnu Priya: తెలుగు టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ ప్రస్తుతం తొమ్మిదో సీజన్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే, మాజీ కంటెస్టెంట్, యాంకర్ విష్ణుప్రియ తాజాగా చేసిన వ్యాఖ్యలు షోపై మళ్లీ చర్చను రేకెత్తించాయి.

‘పోవే పోరా’ వంటి షోల ద్వారా యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించిన విష్ణుప్రియ, గతంలో బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొన్నారు. తోటి కంటెస్టెంట్ పృథ్వీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా కూడా ఆమె ఆ సీజన్‌లో ప్రత్యేకంగా నిలిచారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె బిగ్‌బాస్ అనుభవం చాలా బాధాకరమని వెల్లడించారు.

“డబ్బులు సంపాదించాలి, కొత్త ఇల్లు కట్టుకోవాలి అన్న కోసమే బిగ్‌బాస్‌కు వెళ్లాను. కానీ నా ఆశలు నెరవేరలేదు. ఇప్పటికీ పాత ఇంట్లోనే ఉంటున్నాను. నిజంగా అది నా జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయం. ఆ షోలో ఉండటం వల్ల వృద్ధి ఏమీ కాలేదు. నేను నన్నే ప్రశ్నించుకున్నా. మళ్లీ పిలిచినా వెళ్లను” అని ఆమె చెప్పింది.

విష్ణుప్రియ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో పెద్దగా చర్చకు దారితీస్తున్నాయి. చాలామంది ఆమె నిజాయతీని ప్రశంసిస్తుండగా, కొందరు మాత్రం “షో వల్ల వచ్చిన పాపులారిటీని ఎంజాయ్ చేసి ఇప్పుడు విమర్శలు చేయడం ఏంటి?” అని విమర్శిస్తున్నారు.

నూతన సీజన్ విజయవంతంగా సాగుతున్న వేళ, విష్ణుప్రియ చేసిన ఈ వ్యాఖ్యలు బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్‌గా.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *