Tirumala

Tirumala: తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో కొండ చిలువ కలకలం

Tirumala: తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో తాజాగా కొండ చిలువ కనిపించి భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో, భక్తులు ప్రయాణిస్తున్న దారిలో ఈ భారీ పాము రోడ్డుపై కనిపించింది.

వినాయక స్వామి ఆలయాన్ని దాటి కారులో వెళ్తున్న కొందరు భక్తులు ఈ కొండ చిలువను చూశారు. వెంటనే అప్రమత్తమై తమ ఫోన్లలో దానిని వీడియో తీశారు. కొండ చిలువ రోడ్డుపై అటూ ఇటూ పాకుతూ కనిపించడం ఆ వీడియోలో ఉంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అడవి జంతువులు తరచుగా కనిపించే తిరుమల ఘాట్ రోడ్లపై, కొండ చిలువ కనిపించడం భక్తులలో కొంత ఆందోళన కలిగించినా, అది ఎవరికీ ఎలాంటి హానీ చేయకుండా అడవిలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *