Crypto

Crypto: కుప్పకూలిన బిట్ కాయిన్ విలువ.. $1 ట్రిలియన్‌కు పైగా నష్టం.. కారణం ఏంటంటే..

Crypto: గత కొన్నాళ్లుగా పెట్టుబడిదారులను భారీగా ఆకట్టుకున్న క్రిప్టోకరెన్సీ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. బిట్‌కాయిన్ (Bitcoin) ధర జూలై 2025 తర్వాత మొదటిసారిగా కీలకమైన $100,000 మార్క్‌కి దిగువకు పడిపోవడంతో, మొత్తం క్రిప్టో రంగం బేర్ మార్కెట్ (Bear Market) దశలోకి అడుగుపెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

అక్టోబర్ 6న నమోదైన రికార్డు గరిష్ట స్థాయి (All-Time High) నుండి బిట్‌కాయిన్ దాదాపు 22 శాతం క్షీణించగా, మొత్తం క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ $1 ట్రిలియన్‌కు పైగా విలువ కోల్పోయింది.

పతనానికి కారణాలు: లివరేజ్, లిక్విడేషన్స్

క్రిప్టో మార్కెట్ పతనానికి ప్రధానంగా రెండు కారణాలను విశ్లేషకులు చెబుతున్నారు.. మార్కెట్‌ను వేగంగా పైకి తీసుకెళ్లగలిగే శక్తి లివరేజ్‌కు ఉన్నప్పటికీ, అదే శక్తి ఇప్పుడు మార్కెట్‌ను క్రూరంగా కిందికి లాగుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అక్టోబర్ 10న ఒక్కరోజే $20 బిలియన్ల లిక్విడేషన్ ఈవెంట్ చోటుచేసుకోవడం మార్కెట్‌ను కుదిపేసింది.

గత కొన్ని వారాలుగా సగటున రోజుకు 3 లక్షలకు పైగా ట్రేడర్లు లిక్విడేషన్‌కు గురవుతున్నారు, ఇది మార్కెట్‌లోని అస్థిరతను సూచిస్తోంది. కాయిన్ గ్లాస్ డేటా ప్రకారం, క్రిప్టో చరిత్రలోనే ఇది అతిపెద్ద లిక్విడేషన్ ప్రక్రియ.

ఇది కూడా చదవండి: Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే….?

పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (Geopolitical Tensions), ప్రపంచ రిస్క్-ఆఫ్ రొటేషన్ సంకేతాలు మరియు తరచుగా వస్తున్న అమెరికా టారిఫ్స్ మార్పు ప్రకటనలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి.

బిట్‌కాయిన్ & ఇథీరియం పరిస్థితి

బుధవారం నాడు ధర 7 శాతం తగ్గడంతో $100,000 మార్క్ కిందకు పడిపోయింది. గ్లాస్‌నోడ్ (Glassnode) డేటా ప్రకారం, బిట్‌కాయిన్ కీలకమైన $109,000 సపోర్ట్‌ను కోల్పోయింది. స్వల్పకాలిక హోల్డర్లు నష్టాలను తగ్గించుకోవడానికి అమ్మకాలు పెంచడం ఒత్తిడికి కారణమైంది.

రెండో అతిపెద్ద క్రిప్టో అయిన ఇథీరియం కూడా 16 శాతం తగ్గి $3060కి చేరుకుంది. ఇది కేవలం రెండు నెలల్లోనే ఆల్ టైమ్ గరిష్ట ధర నుంచి 38 శాతం క్షీణతను చూసింది.

రికవరీపై ఆశలు, సంస్థాగత మద్దతు

భారీ అమ్మకాల మధ్య కూడా కొన్ని సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి.. గత 30 రోజులలో బిట్‌కాయిన్ ETFల్లో 50,000 BTC ఇన్‌ఫ్లోలు నమోదయ్యాయి. ఇది సంస్థాగత పెట్టుబడిదారులు (Institutional Investors) ఇంకా బిట్‌కాయిన్‌ కొనుగోళ్లు కొనసాగిస్తున్నారని సూచిస్తోంది. గడచిన 24 గంటల్లో బిట్‌కాయిన్ $99,000 సపోర్ట్ జోన్‌ను టెస్ట్ చేసిన తర్వాత తిరిగి $102,000 మార్క్‌కు చేరుకుంది. ఇది మార్కెట్ రికవరీ సంకేతాన్ని ఇచ్చింది.

ఇది కూడా చదవండి: NTR: సన్నగా మారిన ఎన్టీఆర్.. టెన్షన్‌లో అభిమానులు!

క్రిప్టో విశ్లేషకుడు ప్లాన్ సి (Plan C) ప్రకారం, ఇది ఇంకా బుల్ మార్కెట్‌లోనే ఉంది. సంస్థాగత మద్దతుతో మార్కెట్ స్థిరంగా ఉంటుందని, బేర్ సినారియోలో కూడా ధర $70,000 కంటే దిగడం కష్టమని, అయితే $80,000–$90,000 వరకు కరెక్షన్ సాధ్యమని అంచనా వేశారు. వాణిజ్య ఒప్పందాల పురోగతి, స్టాక్ మార్కెట్ సానుకూలతతో నవంబర్‌లో రికవరీ సాధ్యమేనని MEXC రీసెర్చ్ చీఫ్ షాన్ యంగ్ తెలిపారు.

ప్రస్తుత పతనం, 2017లో ఆల్ టైమ్ హైకి చేరకముందు బిట్‌కాయిన్ చూసిన 30-40 శాతం ఆరు ప్రధాన కరెక్షన్‌లను గుర్తు చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. పెట్టుబడిదారులు ఇప్పుడు భయందోళనలకు గురవుతున్నప్పటికీ, మార్కెట్ స్థిరత్వం కోసం సంస్థాగత మద్దతుపై ఆశలు పెట్టుకున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *