Hyderabad:

Hyderabad: హుస్సేన్ సాగ‌ర్‌లో మృత‌దేహాల మిస్ట‌రీ వీడింది!

Hyderabad: హుస్సేన్ సాగ‌ర్ వ‌ద్ద నిరంత‌రం పోలీస్ ప‌హారా ఉంటుంది. ఎవ‌రైనా అనుమానాస్ప‌ద స్థితిలో ఉన్న వారిని గుర్తించి, వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఓ పైల‌ట్ పోలీస్ బృందం నిరంత‌రం కాప‌లా ఉంటుంది. అయితే వారి క‌ళ్లుగ‌ప్పి కొంద‌రు జ‌లాశ‌యంలో దూకి ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డే ఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌రుగుతూ ఉంటాయి.

Hyderabad: ఇదే త‌ర‌హాలో ఇటీవ‌లే జ‌లాశ‌యంలో ఓ మృత‌దేహాన్ని గుర్తించారు. ఆల‌స్యంగా ఆ మృత‌దేహం ఎవ‌రిద‌న్న విష‌యం తేలింది. మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం ఏమిటంటే? ఆమె కూతురు కూడా అదృశ్య‌మైంద‌ని తేల‌డంతో అదే హుస్సేన్‌సాగ‌ర్ జ‌లాశ‌యంలో వెతికితే నిన్న ఆమె చిన్నారి కూత‌రు మృత‌దేహం కూడా ల‌భ్యమైంది.

Hyderabad: ఆ ఇద్ద‌రు త‌ల్లీకూతుళ్లు పాత‌బ‌స్తీకి చెందిన పృద్వీలాల్ భార్య కీర్తికా అగ‌ర్వాల్ (28), రెండేళ్ల వ‌య‌సున్న బిడ్డగా పోలీసులు గుర్తించారు. వారిద్ద‌రూ ట్యాంక్‌బండ్ పైనుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. పృద్వీలాల్ వ్యాపారం చేస్తుండ‌గా, కీర్తికా అగ‌ర్వాల్ చార్టెడ్ అకౌంటెంట్గా ప‌నిచేస్తున్నారు. న‌వంబ‌ర్ 2న త‌న భార్య‌, కూతురు క‌నిపించ‌డం లేద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా, ద‌ర్యాప్తులో ఈ విష‌యం తేలింది. కుటుంబ క‌ల‌హాల‌తోనే త‌న కూతురుతో స‌హా కీర్తికా ఆత్మ‌హ‌త్య చేసుకున్నట్టు కేసు న‌మోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *