Rowdy Janardhan

Rowdy Janardhan: రౌడీ జనార్దన్’ సినిమాలో ఆ సీనియర్ నటి.?

Rowdy Janardhan: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రౌడీ జనార్దన్’ చిత్రంలో స్పెషల్ ఎపిసోడ్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ కోసం సీనియర్ హీరోయిన్ విజయశాంతిని ఎంపిక చేయనున్నారు. ఈ వార్తతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Also Read: SSMB29: చిక్కుల్లో మహేష్ టైటిల్.. కొంత పేరు పెడతారా..?

‘రౌడీ జనార్దన్’ సినిమా సెకండ్ హాఫ్‌లో స్పెషల్ ఎపిసోడ్ ఉండనుంది. ఈ ఎపిసోడ్ కోసం దర్శకుడు రవి కిరణ్ కోలా ప్రత్యేక రోల్ రూపొందిస్తున్నారు. ఈ రోల్‌కు సీనియర్ హీరోయిన్ విజయశాంతిని ఎంపిక చేయాలని టీమ్ భావిస్తుంది. ఈ వార్తలో నిజానిజాలు తెలుసుకోవాలి. ఇటీవల కెన్యా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. స్టార్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజశేఖర్ పాత్ర, లుక్ ఇదివరకు చూడని విధంగా ఉంటుంది. ఆయన లుక్ టెస్ట్ కూడా పూర్తయింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి ఈ రౌడీ జనార్ధన్ కాగా, ఇంకోటి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *