Pāraśakti

Pāraśakti: పరాశక్తి మొదటి సింగిల్ వచ్చేస్తుంది?

Pāraśakti: తమిళ చిత్రం పరాశక్తిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా, మొదటి సింగిల్ ఈ వారంలో విడుదల కానుందని తెలిసింది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఈ విషయాన్ని ధృవీకరించాడు.

Also Read: RGV: రమ్యకృష్ణతో ఆర్జీవీ హాట్ హారర్ థ్రిల్!

తమిళ సినిమా పరాశక్తి నుంచి మొదటి సింగిల్ ఈ వారంలో రిలీజ్ కానుంది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. పాట గాయకుల జాబితా ఇంకా వెల్లడి కాలేదు. త్వరలో అప్‌డేట్ ఇస్తామని జీవీ ప్రకాష్ తెలిపాడు. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. గతంలో జీవీ ప్రకాష్ ఇచ్చిన ఆల్బమ్స్ ఎంతో హిట్ అయ్యాయి. ఈ చిత్రంలోని పాటలు కూడా అదే స్థాయిలో ఉంటాయని అంచనా. పరాశక్తి చిత్రం టీమ్ పాట విడుదలతో ప్రమోషన్ పనులు మొదలుపెట్టనుంది. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని తెలుగు టాలెంటెడ్ దర్శకురాలు సుధా కొంగర డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీలీల, రవి మోహన్, అధర్వ మురళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివ కార్తికేయన్, ఆకాష్ భాస్కరన్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2026 లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై కొలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *