Cm revanth: పాలమూరు, నల్గొండ జిల్లాల ప్రజలకు కేసీఆర్, హరీష్ రావు అన్యాయం చేశారు

Cm revanth: కరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందేలా చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ (స్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) పనులను వచ్చే రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఇటీవల ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూలి 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత నిలిచిపోయిన టన్నెల్ పనులను పునఃప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, దేవరకొండ ఎమ్మెల్యే వాల్ నాయక్ తదితరులతో కలిసిలో సమీక్షించారు. టన్నెల్ నిర్మాణానికి సంబంధించి హెలి–మాగ్నెటిక్ సర్వే టెక్నాలజీ వివరాలను నిపుణులతో కలిసి సమీక్షించారు.

తరువాత మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,“1983లో ఆమోదం పొందిన ఎస్‌ఎల్‌బీసీ పనులు 2004–05లో రూ.2,000 కోట్ల అంచనాలతో ప్రారంభమయ్యాయి. కానీ BRS ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. పాలమూరు, నల్గొండ జిల్లాల ప్రజలకు కేసీఆర్, హరీష్ రావు అన్యాయం చేశారు” అని విమర్శించారు.

42 కిలోమీటర్ల ఈ ఎస్‌ఎల్‌బీసీలో ఇంకా 9.8 కిలోమీటర్ల టన్నెల్ పని మిగిలి ఉందని చెప్పారు. సొరంగం కూలిన కారణంగా ఆగిపోయిన పనులను అత్యాధునిక ఏరియల్ ఎలెక్ట్రో–మాగ్నెటిక్ సర్వే ద్వారా మళ్లీ ప్రారంభిస్తామని, 800–1000 మీటర్ల లోతు వరకు భూగర్భ పరిస్థితులను అంచనా వేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *