Gold Rate Today: బంగారం ధర ఈరోజు (సెప్టెంబర్ 25) ఆల్ టైమ్ హైకి చేరుకుంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) ప్రకారం బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.660 పెరిగి రూ.77,020కి చేరుకుంది. అంతకుముందు మంగళవారం పది గ్రాముల ధర రూ.76,360గా ఉంది. ఈ వారంలో ఇప్పటివరకు బంగారం ధర రూ.1167 పెరిగింది.
Gold Rate Today: ఈరోజు వెండి ధర కూడా భారీగా పెరిగింది. దీని ధర రూ.1,922 పెరిగి కిలో రూ.90,324కి చేరింది. అంతకుముందు వెండి రూ.88,402గా ఉంది. ఈ ఏడాది మే 29న వెండి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ.94,280కి చేరింది.
Gold Rate Today: 4 మెట్రోలు – తెలుగురాష్ట్రాల్లో బంగారం ధర
- ఢిల్లీ: 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,750 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,170గా ఉంది.
- ముంబై: 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,600 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,020గా ఉంది.
- కోల్‌కతా: 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,600 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,020గా ఉంది.
- చెన్నై: 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,600, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,020గా ఉంది.
- తెలుగు రాష్ట్రాల్లో: 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,600 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,020గా ఉంది.
Also Read: హైదరాబాద్ లో ఇకపై అర్ధరాత్రి 1 గంట వరకూ ఫుడ్ స్టాల్స్ ఓపెన్!
గమనిక : ఇక్కడ ఇచ్చిన ధరలు మార్కెట్ లో ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయానికి ఉన్నవి . బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక పన్నులు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి . బంగారం కొనాలి అనుకున్నపుడు నాలుగైదు షాపుల్లో విచారించి కొనాల్సిందిగా సూచిస్తున్నాం .

