Road Accident

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున పెను విషాదం సంభవించింది. హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపైని చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో, తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వస్తున్న టిప్పర్‌ లారీ అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు 21 మంది మృతి చెందినట్లు సమాచారం. అలాగే, 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

బస్సుపై పడిన కంకర లోడు
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా, విద్యార్థులు, ఉద్యోగులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగంతో వచ్చిన టిప్పర్‌ లారీ అదుపు తప్పి బస్సును బలంగా ఢీకొట్టడంతో, బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. అంతేకాక, లారీలో ఉన్న కంకర లోడు బస్సు ముందు భాగంలో పడిపోవడంతో, అందులో కూర్చున్న ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. లారీ డ్రైవర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అలాగే, బస్సు డ్రైవర్తో పాటు ముందు భాగంలో ఉన్న కొందరు ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

Also Read: Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూకంపం…నలుగురు మృతి, 60 మందికి పైగా గాయాలు!

సహాయక చర్యలు, ట్రాఫిక్‌ అంతరాయం
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ యంత్రాల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన మృతదేహాలను, గాయపడిన ప్రయాణికులను అతి కష్టం మీద బయటకు తీశారు.

క్షతగాత్రులను వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన పది మందికి పైగా ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా చేవెళ్ల-వికారాబాద్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో అధికారులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే పనుల్లో నిమగ్నమయ్యారు. టిప్పర్‌ లారీ అతివేగం, అజాగ్రత్త వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *