Horoscope: ఈ రోజు (నవంబర్ 3, సోమవారం) మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసుకోండి. ధైర్యం, కృషి, సానుకూల దృక్పథంతో అద్భుతమైన విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఈ రోజు మీ ఆర్థిక, వృత్తి, వ్యక్తిగత జీవితాలలో ఎలాంటి శుభ పరిణామాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries): మనోబలమే మీ ఆయుధం
ఈ రోజు మీ మనోబలమే మీ విజయానికి కీలకం. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి, అడ్డంకులన్నీ మీకు అనుకూలంగా మారిపోతాయి. నిపుణుల సలహాలతో తీసుకునే నిర్ణయాలు శుభ ఫలితాలు ఇస్తాయి. మీరు చేసే ప్రతీ పనిని విశ్వాసంతో చేస్తే విజయం మీదే. ఆదాయం బాగా పెరుగుతుంది, ఆర్థికంగా ఇతరులకు సాయం చేయగలిగే స్థితిలో ఉంటారు. శివపార్వతుల పూజ శాంతిని, శక్తిని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొంటారు, బోనస్లు, అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి.
వృషభం (Taurus): కృషికి గుర్తింపు
వృషభ రాశి వారికి శుభకాలం కొనసాగుతోంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన కొనుగోళ్లు లాభాన్ని అందిస్తాయి. మిమ్మల్ని అభిమానించే వారు పెరుగుతారు, ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. పదోన్నతి, జీతభత్యాల పెరుగుదలకు మార్గం సుగమం అవుతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన ధైర్యాన్ని, దృఢ సంకల్పాన్ని ఇస్తుంది. పదిమందిలో గౌరవ మర్యాదలు అందుకుంటారు.
మిథునం (Gemini): మిత్రుల సహకారం
మిత్రుల సహాయ సహకారాలతో మీరు విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు అనుకూల సమయం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఇష్టదేవతా శ్లోకాలు చదవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పెట్టుబడులపై లాభాలు అందుకుంటారు. పరమశివుని దర్శించండి.
కర్కాటకం (Cancer): పట్టుదలే విజయం
ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చినా, మీ ప్రతీ కష్టం విజయానికి దారి చూపుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ లక్ష్యసాధనలో నిలబడండి. మీ పట్టుదలతో ఏదైనా సాధ్యమే. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. దుర్గారాధన మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. పిల్లల వైఖరి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
సింహం (Leo): గౌరవం, నాయకత్వం
వృత్తి, వ్యాపార రంగాల్లో విజయాలు చేకూరుతాయి. గౌరవం, సన్మానం లభిస్తాయి. సరైన సమయంలో మీకు సహకారం అందుతుంది. మీ నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకర్షిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో పని భారం పెరిగినా, మీరు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. రవి ధ్యానం మీకు ఆత్మశక్తిని పెంచుతుంది. న్యాయ, బోధన, రక్షణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కన్య (Virgo): ప్రశాంతత, ఉత్సాహం
మీ మనస్సులో ప్రశాంతత, హృదయంలో ఉత్సాహం నెలకొంటుంది. వ్యాపారులకు శుభయోగం ఉంది. ఆధ్యాత్మికత మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త వస్తువుల కొనుగోలు ఆనందాన్ని కలిగిస్తుంది. దుర్గాస్తోత్ర పారాయణ ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. పెట్టుబడులకు సంబంధించిన విలువైన పత్రాలు అందుకుంటారు.
తుల (Libra): శుభవార్తలతో ఉల్లాసం
మానసిక దృఢత్వంతో అన్ని పరిస్థితులను జయిస్తారు. శుభవార్తలతో మీలో ఉత్సాహం పెరుగుతుంది. బంధుమిత్రులతో స్నేహపూర్వకంగా వ్యవహరించండి. స్పష్టతతో తీసుకునే నిర్ణయాలు లాభదాయకం. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారంలో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. శివ అష్టోత్తర పఠనం శాంతిని ప్రసాదిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వృశ్చికం (Scorpio): ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
మీ మానసిక దృఢత ఈ రోజు మీ ప్రధాన బలం. మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే శుభ సూచనలు కనిపిస్తాయి. బంధుమిత్రుల ప్రేమ, ఆదరణ మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో సమస్యల నుంచి బయటపడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. ఇష్టదైవ దర్శనం ధైర్యాన్ని, శాంతిని కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలం.
ధనుస్సు (Sagittarius): కొత్త అవకాశాలు
మీ ప్రయత్నాలు విజయాన్ని అందిస్తాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్త అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. శని ధ్యానం మీకు స్థిరబుద్ధిని, శక్తిని ఇస్తుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
మకరం (Capricorn): పట్టుదలతో విజయం
ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా, అవి తాత్కాలికం. మీ పట్టుదల ఆటంకాలను అధిగమిస్తుంది. అలసటను పక్కనబెట్టి సానుకూల దృష్టితో ముందుకు సాగండి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, పని భారం ఉండవచ్చు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. మనశ్శాంతి కోసం చంద్రశేఖర అష్టకం చదవడం మంచిది. ఇల్లు కొనుగోలు, స్థల సేకరణకు కావలసిన నిధులు చేతికి అందుతాయి.
కుంభం (Aquarius): ప్రణాళికలు సఫలం
ఈ రోజు మీకు ధనలాభం కలుగుతుంది. మీరు వేసుకున్న ప్రణాళికలు సఫలమవుతాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ చురుకుదనం అందరినీ ఆకట్టుకుంటుంది. ఉద్యోగంలో పనిభారం పెరిగినా, ఆశించిన ప్రతిఫలం అందుకుంటారు. దుర్గాధ్యానం ఉత్సాహం, ఆత్మశక్తిని పెంచుతుంది. ఇంటర్య్వూలలో ఆశించిన ఫలితాలు సాధిస్తారు.
మీనం (Pisces): స్థిరత్వం, పొదుపు
శ్రమ పెరిగినా ధైర్యంగా నిలబడి విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించి పొదుపు అలవాటు చేసుకోండి. సమస్యలపై విజయం సాధించగలుగుతారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగతి చెందుతాయి. శ్రీవేంకటేశ్వరుని పూజించడం ఆపదలను తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి.

