Rains: హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. మియాపూర్, చందానగర్, జీడిమెట్ల ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. పంజాగుట్ట, అమీర్‌పేట్, బేగంపేట్ ప్రాంతాల్లో కూడా వాన కురుస్తుండగా, పలు రహదారులపై ట్రాఫిక్‌పై ప్రభావం పడింది.

