Aadhaar Card Updates: నవంబర్ నుంచి ఆధార్ మార్పులు, చేర్పులకు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆధార్‌లో పేరు మార్పులు, చిరునామా, పుట్టినతేదీ, ఫోన్ నంబర్‌ను మీ సేవ, ఇతర సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. ఈ అవకాశం 2025 నవంబర్ నుంచి 2026 జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో ఉచితంగా డాక్యుమెంట్ అపడేషన్‌కు కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
Aadhaar Card Updates: ఆయా మార్పుల కోసం 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఐరిస్, ఫింగర్ ప్రింట్, ఫొటో అప్‌డేట్ కోసం మాత్రం మీ సేవ కేంద్రానికి వెళ్లాల్సిందే. యూఐడీఏఐ ఈ ఉచిత మార్పులను తీసుకొచ్చింది. డెమోగ్రాఫిక్ వివరాల మార్పునకు రూ.75 చెల్లించాల్సి ఉండగా, బయోమెట్రిక్ మార్పులకు రూ.175 చెల్లించాలి. పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్స్ మాత్రం ఉచితంగా అవకాశం కల్పించారు.

