Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో నిర్వహించిన చిట్ చాట్‌లో హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇక ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదని, సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగుతామని ఆయన జోస్యం చెప్పారు.
పార్టీ బలోపేతానికి కార్యాలయం నుంచే పాలన
పార్టీ కార్యకర్తలు మరియు నేతలతో మరింత బలమైన బంధాన్ని ఏర్పరచుకోవడంపై చంద్రబాబు దృష్టి సారించారు. ఇకపై వారంలో ఒకరోజు తాను పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి రోజంతా అందుబాటులో ఉంటానని చంద్రబాబు ప్రకటించారు. తనతో పాటు, వారంలో ఒకరోజు నారా లోకేశ్ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకూ పార్టీ ఆఫీస్‌లో అందుబాటులో ఉంటారని తెలిపారు. పార్టీ కార్యాలయానికి వస్తే సొంతింటికి వచ్చినట్లు ఉంటుందని, అక్కడే అసలు వాస్తవాలు తెలుస్తాయని ఆయన అన్నారు. పార్టీ కార్యాలయంలో ఉంటేనే నేతల మధ్య బాండింగ్ పెరిగి, అన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఇంకా బాగా కలిసి పనిచేసే దానిపై దృష్టి పెడతారు అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Ktr: బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది
పాలనా వేగంపై చంద్రబాబు వ్యాఖ్యలు
నాలుగోసారి ముఖ్యమంత్రిగా తన పనితీరు గతంలో కంటే ఎంతో మెరుగ్గా ఉందని చంద్రబాబు నాయుడు పోల్చి చెప్పారు. గత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన పని విధానానికి, 4వ సారి సీఎంగా చేసే దానికి చాలా తేడా ఉంది అన్నారు. ఇప్పుడు చేస్తున్నంత వేగంగా గత మూడు పర్యాయాలు పని చేయలేదు” అని చంద్రబాబు అన్నారు. సాంకేతికత పెరగడం వల్ల పరిపాలనలో వేగం పెరిగి, పాలన సులభతరమైందని ఆయన వివరించారు. గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేస్తే, తాము ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని గాడిలో పెట్టామని తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థను ‘ఆటో పైలట్’లో పని చేసే విధంగా ఏర్పాటు చేశామన్నారు.
ఇది కూడా చదవండి: Tollywood: వంశీ పైడిపల్లికి సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్
ప్రభుత్వ కార్యక్రమాలలో ఓనర్ షిప్
ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో పార్టీ నాయకులు చురుకుగా పాల్గొనాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమానికి పార్టీ నేతలు ఓనర్ షిప్ (బాధ్యత) తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో పార్టీ నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలతో, చంద్రబాబు నాయుడు పార్టీ పటిష్టతపై మరియు సుదీర్ఘ రాజకీయ లక్ష్యంపై తన దృష్టిని స్పష్టం చేశారు.

