Cm revanth: వరంగల్, హనుమకొండ నగరాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన సమ్మయ్యనగర్, పోతన్ నగర్, రంగంపేట ప్రాంతాలను పర్యవేక్షించారు.
తర్వాత నయీంనగర్ బ్రిడ్జి వద్ద పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వరద పరిస్థితులపై ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్లు, అధికారులు, విభాగాధిపతులతో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు తక్షణ సహాయం, రక్షణ చర్యలు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం.


