pan card: ఒకే వ్యక్తి పేరిట ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలుసా? అది చట్ట ప్రకారం నేరమనే విషయం మీకు తెలుసా? అలా ఉంటే మీకు జరిమానా పడుతుంది. వాస్తవంగా ఆదాయపు పన్ను చట్టంలోని 139ఏ సెక్షన్ ప్రకారం.. ఒక వ్యక్తి ఒక పాన్ మాత్రమే కలిగి ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే శిక్షార్హులన్నమాటే.
pan card: ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్న వ్యక్తికి రూ.10,000 జరిమానా విధిస్తారు. ఆదాయ పన్ను చట్టం ప్రకారం.. జరిమానాతోపాటు ఇతర చర్యలు తీసుకోవచ్చు. అలాంటి వ్యక్తుల క్రెడిట్ ప్రొఫైల్ పైన కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే ఒకే పాన్‌కార్డుకు చెందిన రెండు కాపీలు కలిగి ఉండటం చట్టవిరుద్ధమేమీ కానది, దానిని కాపీగా పరిగణిస్తారు.


