Azharuddin:

Azharuddin: మంత్రిగా అజార్ ప్ర‌మాణ స్వీకారం చేసేనా? ఆగేనా?

Azharuddin:కాంగ్రెస్ నేత‌, మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తారా? అనూహ్య ప‌రిణామాల న‌డుమ ఎన్నిక‌ల సంఘం అడ్డుకుంటుందా? స‌డ‌లింపు ఇస్తుందా? అన్న అంశాల‌పై తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల వేళ రాష్ట్ర కాంగ్రెస్ ప్ర‌భుత్వం అజారుద్దీన్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని కీల‌క నిర్ణ‌యం తీసుకున్నది. దీనిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొన్న‌ది.

Azharuddin:అజారుద్దీన్ ఒక్క‌రినే మంత్రి వ‌ర్గంలోకి తీసుకోనున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. ఆయ‌న‌తో రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ శుక్ర‌వారం (అక్టోబ‌ర్ 31) మ‌ధ్యాహ్నం 12.15 గంట‌ల‌కు ప్ర‌మాణ స్వీకారం చేయించ‌నున్నారు. ఇందుకోసం త‌గిన ఏర్పాట్లు కూడా జ‌రిగాయి. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి గ‌వ‌ర్న‌ర్ కార్య‌ద‌ర్శి లేఖ కూడా రాశారు.

Azharuddin:ఇదిలా ఉండ‌గా, జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో ముస్లిం ఓట‌ర్ల‌ను మ‌భ్య‌పెట్టేందుకే కాంగ్రెస్ స‌ర్కారు అజారుద్దీన్‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటుంద‌ని ప్ర‌తిప‌క్షాలైన బీఆర్ఎస్‌, బీజేపీ ఆరోపిస్తున్నాయి. ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి ఉల్లంఘ‌నే అని బీజేపీ ఏకంగా రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన అధికారి సుద‌ర్శ‌న్‌రెడ్డికి లేఖ‌ను రాసింది.

Azharuddin:ఈ మేర‌కు అజారుద్దీన్ మంత్రి ప‌ద‌వి అంశంపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన అధికారి స‌మాచారం ఇచ్చారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఇచ్చే ఉత్త‌ర్వుల‌ను బ‌ట్టి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన అధికారి చ‌ర్య‌లు ఉంటాయి. ఈ అంశం కాసేప‌ట్లోనే తేల‌నున్న‌ది. ఒక‌వేళ ఈసీ అభ్యంతరాలు వ్య‌క్తంచేస్తే అజారుద్దీన్ ప్ర‌మాణ స్వీకారం నిలిచిపోతుంది. లేకుంటే జ‌రిగి తీరుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *