Crime News

Crime News: ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన ఇల్లాలు

Crime News: కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే దురాశతో కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్ జిల్లాలో కలకలం రేపింది. ఈ కేసులో భార్యతో పాటు ఆమె ప్రియుడు, అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం భావ్‌నగర్ శివార్లలో తీవ్ర గాయాలతో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు దర్యాప్తు చేయగా, మృతుడు కార్మికుడిగా పనిచేస్తున్న కమలేష్ ధుధియాగా గుర్తించారు. అతని శరీరంపై ఉన్న గాయాలు అతడిని దారుణంగా హింసించి చంపినట్లు వెల్లడించాయి.దర్యాప్తులో భాగంగా పోలీసులు కమలేష్ సోదరుడిని విచారించగా, కమలేష్, అతని భార్య మమత మధ్య గత కొన్ని నెలలుగా తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది.

దీంతో, పోలీసులు మమతపై దృష్టి సారించారు. విచారణలో మమతకు కేవలం గ్రామానికి చెందిన అమన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ సంబంధం కారణంగానే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసులు గుర్తించారు. ప్రియుడు అమన్‌తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న మమత, అందుకు భర్త కమలేష్ అడ్డుగా ఉన్నాడని భావించింది. దీంతో అమన్‌తో కలిసి భర్తను హతమార్చాలని పన్నాగం వేసింది.

ఇది కూడా చదవండి: Women’s World Cup: 97 ఆలౌట్ నుంచి 319/7 వరకు.. సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా అద్భుతమైన మలుపు!

అమన్, అతని స్నేహితుడు అమిత్తో కలిసి కమలేష్‌ను బయటకు రప్పించారు. అనంతరం ముగ్గురూ కలిసి అతడిని దారుణంగా హత్య చేశారు. హత్య తర్వాత, మమత-అమన్-అమిత్ ముగ్గురూ కలిసి కమలేష్ మృతదేహాన్ని గ్రామం శివార్లలో పడేశారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి చంపినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. మమత, అమన్ కాల్ రికార్డులు, వారి విచారణ ఆధారంగా పోలీసులు నేరానికి సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టారు. పోలీసుల విచారణలో ముగ్గురు నిందితులు నేరాన్ని అంగీకరించారు. మమత, అమన్, అమిత్‌లను అరెస్టు చేసి, హత్య, నేరపూరిత కుట్ర అభియోగాల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో భావ్‌నగర్ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *