Samantha: సమంత కొత్తగా నటిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమాకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుంది. ఇందులో కాంతారా నటుడు గుల్షన్ దేవయ్య విలన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఆయనతో చర్చలు కూడా పూర్తి అయ్యాయి.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు KVN ప్రొడక్షన్స్ నుంచి భారీ అడ్వాన్స్!
స్టార్ హీరోయిన్ సమంత గ్యాప్ తర్వాత ‘మా ఇంటి బంగారం’ ప్రకటించింది. నందిని రెడ్డి దర్శకత్వంలో తన సొంత బ్యానర్ ట్రాలాలలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రం. ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. రాజ్ నిడుమోరు ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. వచ్చే నవంబర్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే తాజా అప్డేట్లో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ వన్’లో విలన్‌గా నటించిన గుల్షన్ దేవయ్య ఈ సినిమాలో ఎంట్రీ ఇస్తున్నాడట. ఆయనతో నందిని రెడ్డి చర్చలు పూర్తి చేసింది. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గుల్షన్ బాలీవుడ్ సీరియల్స్, సినిమాల్లో నటించాడు. ‘కాంతార’లో ఆయన నటనకు ప్రశంసలు అందుకున్నాడు. సమంత ఫ్యాన్స్ ఈ న్యూస్‌కు ఎక్సైట్ అవుతున్నారు. మరి ఈ చిత్రంతో సమంత మ్యాజిక్ చూపిస్తుందో లేదో చూడాలి.

