Heavy Rain Alert: మొంథా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో బుధవారం (అక్టోబర్ 29) వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఆయా జిల్లాల వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
Heavy Rain Alert: బుధవారం (అక్టోబర్ 29) రోజు నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్, వరంగల్, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట కుమ్రం భీం, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
Heavy Rain Alert: ఇప్పటికే ఆయా జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో వాగులు, చెరువులు ఉప్పొంగిపారుతున్నాయి. దీంతో పలుచోట్ల వరద ప్రభావం పొంచి ఉన్నది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరి, పత్తి, మిరప చేలల్లో వర్షపు నీరు చేరడంతో తీవ్రంగా రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నది. పలుచోట్ల వరిచేలు నేలకొరిగి రైతులకు నష్టాలు మిగిల్చాయి.

