Mass Jathara: టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘మాస్ జాతర’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలై అభిమానుల్లో ఉత్సాహం నింపింది. అక్టోబర్ 31న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానున్న ఈ మూవీకి ట్రైలర్‌తోనే మంచి బజ్ ఏర్పడింది.
కేజీ కాదు, టన్నుల సరుకులు రాత్రికే గూడ్స్ ట్రైన్‌లో ఎక్కించండి అంటూ మొదలైన డైలాగ్ ట్రైలర్‌కి పవర్‌ఫుల్ స్టార్ట్ ఇచ్చింది. వెంటనే ఇక నుంచి సత్తెనాష్! అంటూ రవితేజ స్టైల్‌లో చెప్పిన డైలాగ్‌లు ఫ్యాన్స్‌లో మాస్ ఫీలింగ్ పెంచాయి. ఆ ఒక్క సీన్‌తోనే సినిమాలో రవితేజ లుక్, ఎనర్జీ ఎలా ఉంటుందో క్లియర్‌గా తెలుస్తోంది.
Also Read: Chiranjeevi Deepfake Case: AIతో చిరంజీవి ఫొటోలు మార్ఫింగ్.. కేసు నమోదు
దర్శకుడు భాను బొగవరపు ఈ సినిమాతో మొదటిసారి మెగాఫోన్ పట్టారు. ఆయన స్టోరీలో మాస్, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కలగలిపినట్లు ట్రైలర్ సూచిస్తోంది. కథ పూర్తిగా బయటకు రాకపోయినా, హీరో పాత్ర శక్తివంతంగా, సరికొత్త శైలిలో ఉండబోతోందని అర్థమవుతోంది. ‘ధమాకా’ సక్సెస్ తర్వాత మళ్లీ రవితేజ – శ్రీలీల జంట ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ట్రైలర్‌లో వీరి కెమిస్ట్రీ చక్కగా కనిపించింది. ఫుల్ ఎనర్జీతో నిండిన రవితేజకు, చిలిపి అందంతో ఆకట్టుకునే శ్రీలీల జోడీగా అద్భుతంగా సరిపోయారు. సినిమా సంగీతం అందిస్తున్న భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ట్రైలర్ మొత్తానికి జీవం పోశాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మాస్ బీట్స్ స్క్రీన్‌పై ఎనర్జీని పెంచాయి. ప్రేక్షకులు ఈ బిజీఎంను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రిపీట్ మోడ్‌లో వింటున్నారు.
ఈ సినిమాను అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. పెయిడ్ ప్రీమియర్స్‌తోనే భారీగా స్టార్ట్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. సినిమాపై ఇప్పటికే క్రేజ్ పెరిగిపోవడంతో రవితేజ బాక్సాఫీస్ వద్ద మరో హిట్ కొట్టడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి.
‘ధమాకా’ తర్వాత రవితేజకు మాస్ ఆడియన్స్‌లో ఉన్న అంచనాలు చాలా పెద్దవి. ఈ ట్రైలర్ వాటిని ఇంకా రెట్టింపు చేసింది.
మాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం డేస్ కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు. రవితేజ స్టామినాను మళ్లీ బాక్సాఫీస్ వద్ద నిరూపించే టైం వచ్చిందని అంటున్నారు.

