Harish Rao: తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, తన్నీరు సత్యనారాయణ (Tanniru Satyanarayana) గారు గతకొంత కాలంగా అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన మంగళవారం (అక్టోబర్ 28) తెల్లవారుజూమున తుది శ్వాస విడిచారు.
సత్యనారాయణ రావు మరణ వార్త వినగానే బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, హరీష్ రావు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
- నివాళులర్పించేందుకు: సత్యనారాయణ రావు పార్థివ దేహాన్ని సందర్శనార్థం హైదరాబాద్‌లోని హరీష్ రావు నివాసం క్రిన్స్ విల్లాస్‌లో ఉంచనున్నారు. భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు, నేతలు, ప్రజాప్రతినిధులు హరీష్ రావు నివాసానికి చేరుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Karimnagar: స్కూల్ బస్సు ఢీకొని బాలుడి మృతి
- పార్టీ నేతల సంతాపం: సత్యనారాయణ రావు మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఇతర బీఆర్ఎస్ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో హరీష్ రావు విజయానికి, ఆయన వ్యక్తిత్వ నిర్మాణానికి తండ్రి ప్రోత్సాహం, మార్గదర్శకత్వం ఎంతో ఉందని సన్నిహితులు చెబుతుంటారు. ఈ విషాద సమయంలో హరీష్ రావు కుటుంబానికి ధైర్యం చేకూరాలని అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

