Spicejet: మదురై నుంచి దుబాయ్ వెళుతున్న స్పైస్‌జెట్ విమానం (SpiceJet Flight) చెన్నైలో సాంకేతిక లోపం కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేసింది. ప్రయాణం మధ్యలో పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించి, వెంటనే చెన్నై ఎయిర్‌పోర్ట్ అధికారులను అప్రమత్తం చేశారు.
విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. విమానాన్ని భూమిపై దిగిన అనంతరం టెక్నికల్ టీమ్ పరిశీలనలు ప్రారంభించింది.
ఎయిర్‌లైన్ వర్గాల ప్రకారం, ప్రయాణికుల భద్రత కోసం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, సమస్య పరిష్కారమైన వెంటనే విమానాన్ని తిరిగి ప్రయాణానికి సిద్ధం చేస్తామని తెలిపారు.

