Kurnool Bus Accident: కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో హైవేపై ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై మరో ట్విస్ట్ నెలకొన్నది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఇదే సంఘటనలో బైకర్ శివకుమార్ కూడా మృతి చెందాడు. తొలుత బైక్ను ఢీకొనడంతోనే బస్సు దహనమైందని భావించారు. కానీ, అంతకు ముందే బైక్ స్కిడ్ అయి దానిని నడుపుతున్న శివశంకర్ చనిపోగా, నడిరోడ్డుపై ఉన్న బైక్ను ఢీకొనడంతో బస్సుకు మంటలు అంటుకున్నాయని పోలీసులు తమ దర్యాప్తులో నిర్ధారించుకున్నారు.
Kurnool Bus Accident: బస్సు ప్రమాద ఘటనకు ముందే చనిపోయిన బైకర్పై అతని స్నేహితుడు ఎర్రిస్వామి ఉలిందకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివశంకర్ నిర్లక్ష్యం వల్లే బైక్ డివైడర్ను ఢీకొట్టి, రోడ్డుపై పడిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. రోడ్డుపై పడిన బైక్ను మరో వాహనం ఢీకొనడంతో నడిరోడ్డుపైకి వచ్చిందని, దాని పైనుంచి బస్సు వెళ్లడంతో మంటలు చెలరేగాయని ఎర్రిస్వామి పోలీసులకు వివరించాడు.
Kurnool Bus Accident: ఇదిలా ఉండగా, ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన స్నేహితుడు ఎర్రిస్వామిని వారి స్వగ్రామంలో వదలడానికే వెళ్తూ శివశంకర్ రోడ్డు ప్రమాదంలో తనువు చాలించాడు. అయితే శివశంకర్ మద్యం తాగి ఉన్నట్టు ఘటనకు ముందు విడుదలైన ఓ వీడియోలో రికార్డయి ఉన్నది. సమీప పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకున్న ఆ ఇద్దరు రోడ్డుపై నుంచి వెళ్తుండగా, ఈ ప్రమాదం చోటుచేసుకున్నది.

