Telangana: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయం కొందరు ఉద్యోగులకు శరాఘాతంలా మారింది. అక్టోబర్ 25వ తేదీనే తీసుకొచ్చిన ఓ ఉత్తర్వుకు అదే రోజు గడువు విధించింది. అయితే ఈ అంశంపై గతం నుంచి చెప్పుకుంటూ వచ్చిన సర్కార్ ఆఖరి అవకాశంగా విధించింది. ఆధార్ లింక్ చేయని ఉద్యోగుల జీతాలను నిలిపివేస్తామని హెచ్చరించింది. అక్టోబర్ 25లోగా ఆధార్ లింక్ చేయని ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను నిలిపివేస్తామని ప్రకటించింది.
Telangana: ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ ఆధార్, సెల్ఫోన్ నంబర్ల వివరాలను ఇవ్వాలని, దానికి గడువును కూడా విధించింది. అక్టోబర్ 25లోగా ఆయా వివరాలు ఇవ్వని ఉద్యోగులకు ఈ నెల జీతం రాదని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్య అధికారులకు ఆర్థిక శాఖ హెచ్చరికలను సైతం జారీ చేసింది.
Telangana: రాష్ట్ర ప్రభుత్వంలో పర్మినెంట్, తాత్కాలిక ఉద్యోగులు 10.14 లక్షల మంది వరకు ఉన్నారు. ఆయా ఉద్యోగుల పేర్లు, వారి హోదా, ఆధార్, ఫోన్ నంబర్లు తదితర వివరాలన్నీ నమోదు చేయాలని ఈ నెల 10వ తేదీనే నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తర్వాత 17వరకు పొడిగించిన సర్కారు, అక్టోబర్ 25 గడువును విధించింది.

