Weekly Horoscope

Weekly Horoscope: రాశి ఫలాలు: ఈ వారం మీ జాతకం ఎలా ఉందంటే!

Weekly Horoscope: ఈ వారం పలు రాశుల వారికి లక్ష్యంపై ఏకాగ్రత అవసరం. గతం నేర్పిన పాఠాలను గుర్తుంచుకుంటూ, తొందరపాటు లేకుండా ప్రతి అడుగునూ ఆచి తూచి వేయాలి. ప్రస్తుత వాతావరణం కొన్ని సవాళ్లను విసరవచ్చు, అయినప్పటికీ మనోబలంతో వాటిని అధిగమించవచ్చు. వృత్తి, వ్యాపార రంగాల్లో పురోగతికి, ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి, అయితే మొహమాటం, అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటం ముఖ్యం. మీ పన్నెండు రాశుల ఫలితాలు ఇక్కడ వివరంగా ఉన్నాయి.

మేష రాశి: (కృత్తిక 1 పాదం, అశ్విని, భరణి)
లక్ష్యంపైనే గురి పెట్టండి. వైఫల్యాలు నేర్పిన పాఠాలను మరిచిపోకండి. కాలం కొంత వ్యతిరేకంగా ఉంది కాబట్టి, ఆచితూచి అడుగు వేయాలి. ఆరంభశూరత్వం పనికిరాదు. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ఆత్మీయుల విషయంలో అపోహలకు తావివ్వకండి. వాహన ప్రయాణంలో అతి వేగాన్ని నియంత్రించండి. నవగ్రహ శ్లోకాలను పఠించండి.

వృషభ రాశి: (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి అనువైన సమయం. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. పదవీయోగం ఉంది. భూలాభం సూచితం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పెద్దల ఆశీస్సులు అందుతాయి. వారాంతంలో ఓ శుభవార్త వింటారు. పిల్లలకు మంచి జరుగుతుంది. మహాలక్ష్మిని పూజించండి.

మిథున రాశి: (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
మనోబలంతో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు. అదృష్టం వరిస్తుంది. ఎంతోకాలం నుంచీ ఎదురుచూస్తున్న ఓ పని ఈవారం పూర్తవుతుంది. సృజనాత్మకతతో కొన్ని సమస్యల్ని పరిష్కరిస్తారు. మీ కారణంగా కొందరికి మేలు జరుగుతుంది. వ్యాపారంలో కలిసొస్తుంది. ఉద్యోగ నిర్వహణలో అశ్రద్ధ వద్దు. కొత్త ప్రయోగాలకు ఇది సమయం కాదు. అష్టలక్ష్మిని ధ్యానించండి.

కర్కాటక రాశి: (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. పొదుపు-మదుపు ప్రణాళికకు ప్రాధాన్యం ఇవ్వండి. ఒత్తిడికి దూరంగా ఉండండి. మొహమాటం వల్ల సమస్యలు చుట్టుముట్టే ఆస్కారం ఉంది. మిత భాషణం ఉత్తమం. కొందరు కావాలనే ఇబ్బందులు సృష్టిస్తారు. లౌక్యంతో పరిష్కరించుకోండి. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. నవగ్రహాలను పూజించండి.

సింహ రాశి: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం)
ఉద్యోగంలో కలిసొస్తుంది. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. కొత్త ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. అసాధ్యంగా భావించిన పని కూడా సులభసాధ్యం అవుతుంది. వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు. ఇతరులపైన ఆధారపడకండి. గతంలోని పెట్టుబడులు రాబడిని అందిస్తాయి. దుర్గామాతను ధ్యానించండి.

కన్యా రాశి: (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
మనోబలాన్ని పెంచుకుంటారు. లక్ష్యం పట్ల నిబద్ధత అవసరం. మీదైన ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సంపదల్ని సృష్టించుకునే అవకాశం తలుపుతడుతుంది. ఆశావాదంతో దాన్ని సద్వినియోగం చేసుకోండి. రుణాలకు దూరంగా ఉండండి. గతంలోని ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సూర్యనారాయణ మూర్తిని పూజించండి.

తులా రాశి: (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వ్యాపార ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మీదైన ప్రతిభతో అందర్నీ మెప్పిస్తారు. కొత్త కార్యక్రమాలు లాభదాయకం. దీర్ఘకాలిక ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. అదృష్టయోగం సూచితం. కొందరికి మేలు చేయబోతే కీడు జరిగే ఆస్కారం ఉంది. చుట్టూ ఉన్నవారితో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్ని తేలిగ్గా తీసుకోకండి. సూర్యుడిని ధ్యానించండి.

వృశ్చిక రాశి: (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
విజయాలు వరిస్తాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగుల సంపాదన పెరుగుతుంది. వ్యాపారులు లాభాలను అందుకుంటారు. చిన్నచిన్న చికాకులను పట్టించుకోకండి. విధి నిర్వహణలో ఒత్తిడికి గురికాకండి. బంధుమిత్రుల వల్ల మేలు కలుగుతుంది. వారం మధ్యలో శుభవార్త వింటారు. సూర్యుడిని స్మరించుకోండి.

ధనుస్సు రాశి: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం)
శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో స్పష్టత వస్తుంది. మొత్తంగా ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. కొన్ని నిర్ణయాలను పునరాలోచించుకోవాలి. విష్ణు సహస్రనామం పఠించండి.

మకర రాశి: (ఉత్తరాషాడ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఉద్యోగులకు కొత్త కొలువులు లభిస్తాయి. పదవీయోగం ఉంది. మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు. గతంలోని ఇబ్బందులు తొలగిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ఇతరులపైన ఆధారపడకండి. లక్ష్మీదేవిని ఉపాసించండి.

కుంభ రాశి: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆత్మబలంతో అనుకున్నది సాధిస్తారు. పరిస్థితులకు తగినట్టు ప్రణాళికను రచించుకోండి. ముఖ్య వ్యవహారాల్లో లౌక్యం అవసరం. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తారు. మొహమాటానికిపోయి రుణాల బారిన పడకండి. ఆత్మీయుల విషయంలో అపార్థాలకు తావివ్వకండి. ఆరోగ్యం జాగ్రత్త. నవగ్రహ శ్లోకాలను పఠించండి.

మీన రాశి: (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
మనోబలంతో కొత్త పనులను ప్రారంభించండి. సరైన ప్రణాళికతో ఒత్తిడిని తగ్గించుకోండి. ప్రతి అడుగూ ఆచితూచి వేయాలి. కుటుంబ సభ్యుల సలహాలు మంచి చేస్తాయి. బుద్ధిబలంతో వ్యాపార సమస్యల్ని అధిగమిస్తారు. వ్యతిరేక వాతావరణంలోనూ ప్రశాంతంగా వ్యవహరించండి. భారీ లక్ష్యాల జోలికి వెళ్లకండి. నవగ్రహ శ్లోకాలను పఠించండి.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *