Kurnool Bus Accident: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా, కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు సమీపంలో జరిగిన బస్సు దహనం దుర్ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఎదురుగా ఉన్న బైక్ను ఢీకొని, రోడ్డుపై ఆ బైక్ను ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయి. ఈ ఘోర ప్రమాదంలో బైకర్ సహా 20 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు.
Kurnool Bus Accident: ఇదే ఘటనలో మంటలు మరింతగా వ్యాపించడానికి మరో విషయం వెలుగులోకి వచ్చింది. బస్సు లగేజీ విభాగంలో ఉంచిన 234 కొత్త మొబైల్ ఫోన్లు మంటలను మరింతగా పెంచాయని అధికారుల విచారణలో తేలింది.హైదరాబాద్ నగరానికి చెందిన మంగనాథ్ అనే వ్యాపారి రూ.46 లక్షల విలువైన రియల్మీ కంపెనీ సెల్ఫోన్ల బాక్సులను బస్సులో పార్సిల్ చేశాడు. అవి బెంగళూరులోని ఫిప్కార్ట్కు చేరాల్సి ఉంటుంది.
Kurnool Bus Accident: ఈ ప్రమాదం జరిగినప్పుడు మంటల తీవ్రత పెరగడానికి ఈ సెల్ఫోన్ల బ్యాటరీలు పేలిపోవడం కూడా ఓ కారణమేనని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. బస్సుకు బైక్ ఢీకొనగానే మంటలు చెలరేగాయి. ఆ మంటలు వ్యాపించి లగేజీ విభాగంలో ఉన్న ఫోన్లు కాలిపోయాయి. ఈ సమయంలోనే ఆ సెల్ఫోన్ల బ్యాటరీలు వరుసగా పేలిన శబ్దాలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Kurnool Bus Accident: సెల్ఫోన్లే కాకుండా బస్సులు ఏసీ వ్యవస్థకు అమర్చిన విద్యుత్ బ్యాటరీలు కూడా పేలిపోవడంతో మంటలు మరింత చెలరేగాయని ఏపీ అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ పీ వెంకటరమణ తెలిపారు. మంటలు మరింతగా వ్యాపించడానికి ఈ రెండు కూడా కారణాలేనని తెలిపారు. వీటి కారణంగా మంటలు వెనువెంటనే వ్యాపించాయని, ప్రయాణికులు తేరుకోలేకపోయారని చెప్పారు.

