Salman

Salman: మద్యం తాగి బిగ్ బాస్ కి వచ్చిన సల్మాన్?

Salman: బిగ్ బాస్ హిందీ రియాలిటీషోకు ఎప్పటినుంచో హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. తన హోస్టింగ్ తో ఈ సెలబ్రిటీ రియాలిటీ షోకు మరింత క్రేజ్ తీసుకొచ్చాడు. ముఖ్యంగా వారాంతంలో సల్మాన్ హాజరయ్యే బిగ్ బాస్ ఎపిసోడ్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. ఈ షోలో సల్లూ భాయ్ ధరించే దుస్తులు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ఇప్పుడు బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ కు సల్మాన్ ఖాన్ మద్యం తాగి హోస్ట్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. మరి ఈ ఆరోపణలు నిజమా? పూర్తి వివరాలు చూద్దాం!

Also Read: Hailesso: భారీ బడ్జెట్ తో సుడిగాలి సుధీర్‌ ‘హైలెస్సో’!

ఈ షోలో సల్మాన్ ఖాన్ ప్రవర్తన భిన్నంగా ఉంది. ముఖ్యంగా ఆయన ముఖం బాగా ఉబ్బిపోయినట్లు కనిపించింది. కళ్లు కూడా వాచిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన చాలా మంది సల్మాన్ ఖాన్ తాగి ఉన్నాడని విమర్శించారు. అయితే దీనిని సల్మాన్ అభిమానులు ఖండిస్తున్నారు. మహాభారత్ హిందీ సీరియల్‌లో నటించిన పంకజ్ ధీర్ ఇటీవలే కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలకు సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. ఆ తర్వాత రియాద్ వెళ్లి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమిర్, షారుఖ్ ఖాన్‌లతో పాటు సల్మాన్ ఖాన్ వేదికను పంచుకున్నారు. ఆ తర్వాత, అక్కడి నుంచి నేరుగా కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి ఇండియాకు తిరిగి వచ్చారు. ఆ తర్వాత బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్‌కు వచ్చారు. ఈ బిజీ షెడ్యూల్ కారణంగానే సల్మాన్ ఖాన్ సరిగ్గా నిద్రపోలేదు. అందుకే ఆయన కళ్ళు ఉబ్బిపోయాయి. నిద్ర లేకపోవడం వల్ల సరిగ్గా నిలబడలేకపోయాడు కూడా. ఈ క్రమంలోనే కొంతమంది సల్మాన్ ను తప్పుగా అర్థం చేసుకున్నారని అభిమానులు చెబుతున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *