Telangana Liquor Policy: మద్యం దుకాణాలకు లైసెన్స్‌ల కోసం దరఖాస్తుల గడువు అక్టోబర్ 23 నాటికి ముగిసింది. ఇక ఇదేనెల 27న మద్యం దుకాణాలకు టెండర్ నిర్వహించనున్నారు. లాటరీ పద్ధతిలో దరఖాస్తుదారుల నుంచి ఎంపిక చేసిన వారికి దుకాణాల లైసెన్స్‌లను కేటాయిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,620 దుకాణాలకు ఈ సారి మద్యం టెండర్లను కేటాయించనున్నారు.
Telangana Liquor Policy: గతంలో అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల గడువును ప్రభుత్వం విధించింది. అయితే తక్కువ దరఖాస్తులు రావడం, బంద్, సెలవుల కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయామన్న కొందరు ఆశావహుల వినతి మేరకు దరఖాస్తు గడువును 23 వరకు ప్రభుత్వం పొడిగించింది. దీంతో మొత్తం దరఖాస్తులు 95,285 దరఖాస్తులు మద్యం దుకాణాల కోసం వచ్చినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు.
Telangana Liquor Policy: ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,858 కోట్ల ఆదాయం సమకూరిందని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి 29,430 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో కేవలం 4,013 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. నిరుడు 1.32 లక్షల దరఖాస్తులు రాగా, 2,641 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే ఈసారి దరఖాస్తు రుసుము పెంపుతో గతేడాది కంటే ఈ సారి దరఖాస్తులు తక్కువ వచ్చినా ఆదాయం రూ.218 కోట్లు అదనంగా వచ్చింది.
Telangana Liquor Policy: హైడ్రా కూల్చివేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం దిగజారడంతో ఈసారి మద్యం దుకాణాలకు దరఖాస్తులు తగ్గుతాయని భావించిన ఎక్సైజ్ శాఖ కొన్ని వ్యూహాత్మక చర్యలతో దరఖాస్తుల సంఖ్య పెరగడంతో పాటు ఆదాయం పెరిగిందని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. డిమాండ్ ఉన్న ప్రాంతాలకు మద్యం దుకాణాలను తరలించడం కూడా ఫలించిందని ఆ వర్గాలు తెలిపాయి. ఈసారి పొరుగు రాష్ట్రాలు ముఖ్యంగా, ఏపీ, కర్ణాటక నుంచి భారీగా దరఖాస్తులు సమర్పించినట్టు సమాచారం.

