Kurnool Bus Tragedy: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో NH 44 జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం, ఆ తరువాత చెలరేగిన అగ్నిప్రమాదం 19 మందిని బలిగొన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ లగ్జరీ స్లీపర్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి మంటల్లో చిక్కుకుంది. ఈ భయానక ఘటనలో ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు ఆ క్షణాలను మీడియాతో పంచుకున్నారు.
బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులలో ఒకరైన హారిక, ప్రమాదం జరిగిన తెల్లవారుజామున 3:00 నుండి 3:30 గంటల ప్రాంతంలో నిద్రలో ఉన్నారు. “బస్సు లో గందరగోళం చూసి ఆశ్చర్యపోయిన నేను మేల్కొని చూసేసరికి మంటలు వాహనాన్ని దాదాపుగా చుట్టుముట్టాయి” అని హారిక చెప్పారు.
అదృష్టం కొద్దీ, బస్సు వెనుక ఎగ్జిట్ వద్ద ఉన్న తలుపు విరిగిపోవడంమే ఆమె ప్రాణాలతో ఉండడానికి కారణం. వెనుక తలుపు విరిగిపోయింది, కాబట్టి నేను అక్కడి నుండి దూకాను. దూకే సమయంలో నాకు గాయమైంది అని ఆమె తెలిపారు. మంటలు కొన్ని సెకన్లలోనే బస్సు అంతటా వ్యాపించాయని, తమతో పాటు ప్రయాణించిన 19 మంది మరణించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తప్పించుకోవడానికి పగలగొట్టిన కిటికీలు
ప్రాణాలతో బయటపడిన మరో వ్యక్తి జయంత్ కుష్వాహా వివరాల ప్రకారం, బస్సు మెయిన్ డోర్ తాళం వేసి ఉండటం ప్రయాణికులను మరింత ఇబ్బంది పెట్టింది. “మేము మొదట ముందు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాము, కానీ బస్సు మెయిన్ డోర్ లాక్ వేయడంతో తరువాత మేము వెనుక వైపున ఉన్న అత్యవసర కిటికీని పగలగొట్టి బయటకు దూకాము” అని ఆయన వివరించారు. కిటికీ ఎత్తుగా ఉండటం వలన కొందరు దూకేటప్పుడు పడిపోయి స్పృహ కోల్పోయినట్లు తెలిపారు. డ్రైవర్ సీటు దగ్గర ఉన్న కిటికీలను పగలగొట్టి కూడా కొందరు తప్పించుకోగలిగారు.
సీనియర్ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, మంటలు చెలరేగిన తర్వాత వైర్లు తెగిపోవడం వలనే ప్రధాన ద్వారం ఇరుక్కుపోయి ఉండవచ్చు అని తెలిపారు.
బస్సు స్లీపర్ కావడంతో పండుకునే వారికీ ఇబ్బంది కలగకుండా ఉండడానికి సెపరేట్ గా అందరికి కర్టెన్స్ ఉంటాయి. దీనివల్ల బస్సు లో జరుగుతున్నా గందరగోళం పైన ఉన్న వాళ్లకి తెలియలేదు కింద ఉన్న వాళ్ళు పైన ఎవరికైన తెలుపుదాం అనుకున్న కర్టెన్స్ వేసివుండటంతో వేరేవాళ్లకి చెప్పే సమయం లేకుండాపోయింది ఆ సమయంలో ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి అనే తొందరలోనే ఉన్నారు.
డ్రైవర్ పారిపోయాడా?
కావేరీ ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సులో డ్రైవర్, సహాయకుడితో సహా దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలను గమనించిన దాదాపు 20 మంది ప్రయాణికులు కిటికీలు పగలగొట్టి, అత్యవసర మార్గాల ద్వారా బయటకు దూకారు. అయితే, బస్సు బూడిదగా మారేలోపు డ్రైవర్ మాత్రం పారిపోయి ఉండవచ్చని తెలుస్తోంది. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి తెలిపినట్లుగా, కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా పూర్తిగా కాలిపోయాయి.
ప్రమాదానికి అసలు కారణం, మంటలు చెలరేగడానికి దారితీసిన పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ రవాణా అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలియజేస్తూ, మృతుల కుటుంబాలకు ₹ 2 లక్షలు, గాయపడిన వారికి ₹ 50 వేలు ఆర్థిక సహాయం ప్రకటించారు.

