Bus Accident: కర్నూలు బస్సు దహనం ఘటనలో మరణించిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురూ ఉన్నారు. ఇప్పటివరకూ 20 మందికి పైగా చనిపోయినట్టు గుర్తించారు. మొత్తం 42 మంది ప్రయాణిస్తున్న ఆ బస్సులో 12 మంది ప్రాణాలతో బయటపడ్డారు. భార్యభర్తలు సహా వారి ఇద్దరు పిల్లలు ఇదే ప్రమాదంలో సజీవదహనమయ్యారు.
Bus Accident: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేశ్ (35), అతని భార్య అనూష (32), వారి కుమారుడు యశ్వంత్ (8), కూతురు మన్విత (6) మృతితో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. గోళ్లవారిపల్లిలోని రమేశ్ తల్లిదండ్రులతోపాటు బంధుమిత్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.
Bus Accident: గోళ్లవారిపల్లిలోని రమేశ్ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ పరామర్శించారు. మృతదేహాలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో రమేశ్ తల్లిదండ్రులు, బంధుమిత్రులు అక్కడికి బయలుదేరి వెళ్లారు. చిన్నారులు సహా కుటుంబం అంతా దుర్ఘటనలో ప్రాణాలిడవడంతో రమేశ్ తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి.

