Tollywood: చిరంజీవి సినిమాలో విక్టరీ వెంకటేశ్

Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో మరో భారీ మల్టీస్టారర్ రూపుదిద్దుకోనుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించబోతున్న కొత్త చిత్రంలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.ఈ సినిమా టైటిల్ ఒక్కటే ఆసక్తిని రేపుతోంది. చిరంజీవి అసలు పేరే “ మన శంకర్ వరప్రసాద్”. అందుకే ఈ టైటిల్ చుట్టూ అభిమానుల్లో భారీ బజ్ నెలకొంది. ఇప్పుడు వెంకటేశ్ ఎంట్రీతో అంచనాలు మరింతగా పెరిగాయి.

వివరాల్లోకి వెళ్తే… ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మెగా, వెంకీ కాంబినేషన్‌లో ఈ చిత్రం వినోదం, భావోద్వేగం, యాక్షన్‌లతో నిండిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది.

వెంకటేశ్ పాత్ర గురించి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, ఆయన ఓ ప్రత్యేకమైన ఎమోషనల్ రోల్లో కనిపించనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. “చిరు–వెంకీ కాంబో”ని ప్రేక్షకులు పెద్ద ఎత్తున స్వాగతించబోతున్నారని నిర్మాతలు నమ్ముతున్నారు

ఫ్యాన్స్‌లో ఆనందం వెల్లివిరుస్తుంది

మెగాస్టార్ అభిమానులు మాత్రమే కాకుండా వెంకటేశ్ అభిమానులూ ఈ కాంబినేషన్‌పై సంబరాలు చేసుకుంటున్నారు. “గాడ్ ఆఫ్ మాస్” చిరంజీవి, “విక్టరీ స్టార్” వెంకటేశ్ ఒకే తెరపై కనిపించడం తెలుగు ప్రేక్షకులకు పండగే అని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *