Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. ఇప్పటికే కొన్ని కీలక వెసులుబాటును అందించిన సర్కార్.. ఆర్థిక స్థోమత లేనివారికి మహిళా సంఘాల నుంచి ఆర్థిక సాయం కూడా ఇస్తామని ప్రకటించింది. తాజాగా స్థలం తక్కువగా ఉన్న లబ్ధిదారులు జీ+1 ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Indiramma Indlu: చిన్నప్లాట్లు ఉన్నవారు ఇందిరమ్మ ఇళ్లను జీ+1 పద్ధతిలో నిర్మించుకోవచ్చని తెలుపుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇల్లు కనీసం 400 చదరపు అడుగుల నుంచి గరిష్టంగా 600 చదరపు అడుగులు ఉండాలని ప్రభుత్వం షరతు విధించింది. కానీ, చాలా మంది ఇళ్ల స్థలాలు 400 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉండటంతో వారికి అధికారులు నిబంధనల షరతు విధిస్తూ వచ్చారు. దీంతో వారంతా నిరాశకు లోనయ్యారు.
Indiramma Indlu: ఈ దశలో పునరాలోచించిన రాష్ట్ర సర్కార్ వెసులుబాటు కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో 400 చదరపు అడుగుల నిర్మాణం సాధ్యం కాని స్థలాల్లో జీ+1 పద్ధతితో ఇంటి నిర్మాణం చేపట్టవచ్చని చెప్పింది. కనీస కార్పెట్ ఏరియా 323 చదరపు అడుగులు ఉండాలని మాత్రం స్పష్టంచేసింది. కిచెన్, స్నానాల గది, మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలని జీవోలో పేర్కొన్నది. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. స్థలం తక్కువ ఉన్నదని బాధపడుతున్న వారంతా తాజాగా నిర్మాణ పనులకు సిద్ధమవుతున్నారు.