Horoscope

Horoscope: రాశి ఫలాలు: మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో తెలుసుకోండి!

Horoscope: గురువారం, అక్టోబర్ 23, 2025 నేడు పన్నెండు రాశుల వారికి గ్రహాల గమనం ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోందో ఇక్కడ ఉంది. మీ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి, ఆరోగ్య సూచనలు, అనుసరించవలసిన ఆధ్యాత్మిక అంశాలను తెలుసుకుని ఈ రోజును విజయవంతంగా ప్రారంభించండి. ప్రతి రాశి వారు ఎదుర్కోబోయే అనుకూలతలు, సవాళ్లు, చేపట్టాల్సిన జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకోండి.

మేష రాశి :
నేడు మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. బంధుమిత్రుల నుండి ఆదరాభిమానాలు లభిస్తాయి. మీరు చేపట్టిన పనులు సంతృప్తికరంగా, విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి, కొత్త ప్రాజెక్టులతో ఉత్సాహం పెరుగుతుంది. మీ వ్యూహాలు వ్యాపారంలో లాభాలు తీసుకొస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.

జ్యోతిష్య సూచన: విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం శుభకరం.

వృషభ రాశి
వృత్తి, ఉద్యోగ బాధ్యతలలో ఆకస్మిక మార్పులకు అవకాశం ఉంది. అనుకోకుండా మంచి పరిచయాలు కలుగుతాయి. సుఖసంతోషాలతో గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. దూర ప్రాంత బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

జ్యోతిష్య సూచన: శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.

మిథున రాశి
మీ మనోబలంతో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. వృత్తి, వ్యాపారాలు అధిక లాభాలతో పురోగమిస్తాయి. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉంటాయి. అధికారులు మీ సలహాలతో లాభం పొందుతారు. సామరస్యం పెరుగుతుంది.

జ్యోతిష్య సూచన: దుర్గారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

కర్కాటక రాశి
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి.

జ్యోతిష్య సూచన: శివాలయ సందర్శనం శుభప్రదం.

సింహ రాశి
మీ ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో రాబడి పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా కొనసాగుతాయి. అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి.

జ్యోతిష్య సూచన: ఆదిత్య హృదయం చదవాలి.

కన్యా రాశి
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. తలపెట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. ముఖ్య వ్యవహారాల్లో బంధు మిత్రుల సహాయం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృథా ఖర్చులకు కళ్లెం వేస్తారు. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం.

జ్యోతిష్య సూచన: ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం అవుతాయి.

తులా రాశి
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరం. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో మీ ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. మీ పనితీరుకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. నిరుద్యోగులు విదేశాల నుంచి శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

జ్యోతిష్య సూచన: హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి
మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల విషయంలో మానసిక ఒత్తిడి ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.

జ్యోతిష్య సూచన: కనకధారా స్తోత్రం చదివితే బాగుంటుంది.

ధనుస్సు రాశి
మనోబలంతో చేసే పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు అందివస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. గౌరవం పెరుగుతుంది. స్థిరాస్తి క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

జ్యోతిష్య సూచన: దుర్గాధ్యానం శుభప్రదం.

మకర రాశి
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ధర్మసిద్ధి ఉంది. వ్యాపారాల్లో బాగా బిజీ అవుతారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా సాగిపోతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. సమయానికి విశ్రాంతి అవసరం.

జ్యోతిష్య సూచన: మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.

కుంభ రాశి
ఉద్యోగంలో పురోగతికి లేదా పదోన్నతికి అవకాశం ఉంది. పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

జ్యోతిష్య సూచన: దుర్గాధ్యాన శ్లోకం చదివితే మంచిది.

మీన రాశి :
రోజంతా సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతితో పాటు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. సమాజంలో పలుకుబడి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. అందరినీ కలుపుకొనిపోవడం అవసరం.

జ్యోతిష్య సూచన: శ్రీ ఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *