PM Modi: న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీపావళి పర్వదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆనందం, శాంతి మరియు సౌభాగ్యంతో ప్రకాశింపజేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమంఎక్స్ ద్వారా సందేశాన్ని పంపారు. “దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దివ్యమైన వెలుగుల పండుగ మీ అందరి జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు, అద్భుతమైన ఆరోగ్యాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ సురక్షితంగా మరియు సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ పండుగ ప్రతి జీవితాన్ని సంతోషం, శాంతితో నింపాలని ఆకాంక్షిస్తున్నాను.” అని ప్రధాని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈ ఏడాది కూడా ప్రధానమంత్రి దీపావళి వేడుకలను సరిహద్దు ప్రాంతాలలో భారత సైనికులతో కలిసి జరుపుకునే సంప్రదాయాన్ని కొనసాగించనున్నారు.
ఇది కూడా చదవండి: Womens World Cup 2025: భారత్‌కు వరుసగా మూడో పరాజయం! సెమీస్‌కు ఇంగ్లాండ్
సైనికులతో కలిసి పండుగ జరుపుకోవడం వారిలో మనోధైర్యాన్ని నింపుతుందని, దేశం వారికి అండగా ఉంటుందనే సందేశాన్ని ఇస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ల ప్రజాపాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ వెలుగుల పండుగను రాష్ట్రంలోని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని చెప్పారు. పర్యావరణానికి హాని కలిగించకుండా ఆనందంగా పండుగ జరుపుకోవాలని, ప్రమాదాలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా దీపావళి పండుగ సందర్భంగా దేశమంతటా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ప్రజలు దీపాలను వెలిగించి, లక్ష్మీదేవి, గణేశుడి పూజలు నిర్వహిస్తూ, తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.