Mahesh Kumar goud: కీలక సూచనలు చేసిన పీసీసీ చీఫ్

Mahesh Kumar goud: దీపావళి పండుగ (Diwali Festival) సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

చీకట్లపై వెలుగుల విజయం, చెడుపై మేలుకి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగ ప్రతి ఇంటికి ఆనందాన్ని, కుటుంబాల్లో సౌభాగ్యం, ఐశ్వర్యాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు.> “దీపావళి పండుగ మనలోని చీకట్లను పారద్రోలుతూ ప్రేమ, స్నేహం, సోదరభావం వెలుగులు నింపాలి. సమాజంలో ఐక్యత, సామరస్యానికి పండుగలు ప్రతీకలు. అందరి జీవితాల్లో సంతోష దీపాలు వెలగాలని కోరుకుంటున్నాను,”అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

అలాగే, ప్రజలందరూ పటాకులు పేల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, పర్యావరణాన్ని కాపాడే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ప్రేమ, శాంతి, సౌహార్ద వాతావరణం నెలకొని, తెలంగాణ అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ, అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *