Cm chandrababu: చీకటిని పారద్రోలి వెలుగులు నింపే దీపావళి పండుగ, ఆశలకు నాంది పలికే పండుగ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలకు ఊతమివ్వడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి అండగా నిలవాలన్న సంకల్పంతో రూ.1500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను తొలివిడతగా విడుదల చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.
తన ‘ఎక్స్ (Twitter)’ ఖాతా ద్వారా చేసిన పోస్టులో చంద్రబాబు మాట్లాడుతూ,> “ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో భాగస్వాములైన పారిశ్రామికవేత్తలకు చేయూత ఇవ్వడం మా బాధ్యత. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది”అని పేర్కొన్నారు.
దీపావళి పండుగను రాష్ట్ర అభివృద్ధికి సంకేతంగా మలచుతూ, పరిశ్రమలకు మద్దతు అందించడం ద్వారా ప్రభుత్వం నూతన ఆశల దీపాలు వెలిగిస్తోందని ఆయన తెలిపారు.