Viral News: పోలీసుల తీరుపై విసిగిపోయిన 24 మంది ట్రాన్స్‌జెండర్లు సామూహికంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలకలం రేపింది. అత్యాచారం, బ్లాక్‌మెయిల్ కేసులో నిందితులపై చర్యలు తీసుకోకపోవడంతో మనస్తాపం చెందిన ట్రాన్స్‌జెండర్లు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఫ్లోర్ క్లీనర్ తాగి, ఒకేసారి ఆత్మహత్యకు ప్రయత్నించారు.
అసలేం జరిగిందంటే?
మూడు నెలల క్రితం.. అక్షయ్ కుమావ్, పంకజ్ జైన్ అనే ఇద్దరు వ్యక్తులు తమను తాము జర్నలిస్టులమని చెప్పుకుని ఓ ట్రాన్స్‌జెండర్‌పై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా, బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు కూడా లాక్కున్నారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసినా… విచారణ మాత్రం వేగవంతం చేయలేదు. నిందితులను అరెస్ట్ చేయకుండా కాలయాపన చేశారు. బాధితులు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా, ఉన్నతాధికారులను కలిసినా ఎవరూ పట్టించుకోలేదు.
తీవ్ర నిర్ణయం..
పోలీసులు తమ ఫిర్యాదును పట్టించుకోకపోవడం, నిందితులపై చర్యలు తీసుకోకపోవడంతో ట్రాన్స్‌జెండర్లలో తీవ్ర నిరాశ, ఫ్రస్ట్రేషన్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే, వారికి న్యాయం జరగడం లేదనే మనస్తాపంతో 24 మంది ట్రాన్స్‌జెండర్లు ఫ్లోర్ క్లీనర్ తాగి ఆత్మహత్యకు యత్నించారు.
వెంటనే స్పందించిన స్థానికులు, ఇతరులు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీతో పాటు పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
⚠️ चौंकाने वाली घटना इंदौर से — पायल गुरु और सपना हाजी गुटों के बीच चल रहे विवाद के बीच 24 किन्नरों ने फिनाइल पी लिया। झगड़े में रेप और ब्लैकमेलिंग के आरोप भी सामने आए हैं। #Indore #BreakingNews #TransgenderRights #TransgenderRights #MadhyaPradesh #Transgender pic.twitter.com/tYaLtGXkVE
— khabarwala24 (@khabarwala24) October 16, 2025